HBD Vijay: వైలెంట్‌గా LEO ఫస్ట్ లుక్ పోస్టర్.. ఊహించని గెటప్‌లో విజయ్
కోలీవుడ్‌కు చెందిన హీరోనే అయినా.. తెలుగుతో పాటు దక్షిణాది మొత్తంలోనూ ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను పెంచుకుంటూ.. ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్‌ను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ఒకడు. విలక్షణమైన యాక్టింగ్‌తో పాటు అన్ని రకాల టాలెంట్లతో మెప్పిస్తోన్న అతడు.. సుదీర్ఘ కాలంగా సౌత్‌లో హవాను చూపిస్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు విజయ్ 'లియో' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.
మరో భారీ హిట్ కోసం వేచి చూస్తున్న ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో 'లియో' అనే సినిమాను చేస్తున్నాడు. 'మాస్టర్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే, ఆసక్తి కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ చిత్రం నుంచి విజయ్ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఇళయదళపతి విజయ్ నేడు (జూన్ 22) పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. దీన్ని పురస్కరించుకుని 'లియో' మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో హీరో విజయ్ రక్తం కారుతున్న సుత్తిని పట్టుకుని పూర్తి స్థాయి వైలెంట్ లుక్‌తో కనిపించాడు. అలాగే, అతడి హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్‌గా ఉంది. అంతేకాదు, విజయ్ పక్కనే ఓ క్రూరమైన తోడేలును కూడా చూపించారు. ఆ వెనుక బ్యాగ్రౌండ్ కూడా హై రేంజ్‌లోనే ఉంది. మొత్తానికి ఈ పోస్టర్‌తో 'లియో' మూవీపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'లియో' చిత్రాన్ని లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇక, ఈ మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











