మాస్టర్ తెలుగు టీజర్.. దళపతి స్టైల్ అదుర్స్
దళపతి విజయ్ మాస్టర్ సినిమా ఇప్పుడు సౌత్‌లో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతోన్న విజయ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడేలానే కనిపిస్తోంది. ఖైదీ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న లోకేష్ కనకరాజ్.. విజయ్‌ను మాస్టర్‌గా చూపించబోతోన్నాడు. ఈ మేరకు విడుదల చేసిన టీజర్ ఇప్పటికే రికార్డులను బద్దలు కొట్టేసింది. తమిళంలో రిలీజ్ చేసిన ఈ టీజర్‌ను ఇప్పుడు తెలుగులోనూ డబ్ చేసేశారు.
ప్రస్తుతం డబ్బింగ్ అయినా కూడా విజయ్ సినిమాలు తెలుగులో ఓ మోస్తరుగా ఆడేస్తున్నాయి. తుపాకి సినిమా తరువాత విజయ్ సినిమాకు గిరాకీ పెరిగింది. అలా అదిరింది, సర్కార్, విజిల్ వంటి చిత్రాలు ఇక్కడ పర్వాలేదనిపించాయి. అందుకే మాస్టర్ సినిమాను తెలుగులో డబ్ చేశారు. అలా తెలుగు టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో విజయ్‌కి ఒక్క డైలాగ్ కూడా ఉండదు. ప్రొఫెసర్ జేడీగా విజయ్ క్యారెక్టర్‌ను మాత్రం ఫుల్లుగా ఎలివేట్ చేసేశాడు.

చుట్టుపక్కల ఉన్నవారితో డైలాగ్‌లు చెప్పించారు. ముఖ్యంగా ప్రతి నాయకుడిగా చేస్తున్న విజయ్ సేతుపతితో డైలాగ్‌లు చెప్పింది ఎలివేషన్ ఇచ్చాడు డైరెక్టర్. ఇక ఈ ఇద్దరూ తలపడే సీన్లు సినిమాకు హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. మాస్టర్ అయి ఉండి.. గొడవలు, కొట్లాటలు, మందు అలవాట్లు అంటూ ఏదో అండర్ లైన్‌లో ఎమోషనల్ స్టోరీ ఉన్నట్టు చెప్పనకే చెప్పేశాడు. ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగేందుకు రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications











