Don't Miss!
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
దీపావళి కానుకగా విజయ్ సర్కార్.. నవంబర్ 6న మురగదాస్ చిత్రం..
ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్, తమిళ సూపర్‌స్టార్ విజయ్ కలయికలో తమిళంలో వస్తున్న చిత్రం 'సర్కార్'. కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్, కథానాయికలు. సన్ పిక్చర్స్ బ్యానర్లో కళానిథి మారన్ నిర్మిస్తున్న చిత్రమిది. అభిరుచి గల నిర్మాత, ఇటీవల నవాబ్‌తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అశోక్ వల్లభనేని ఈ చిత్రం తెలుగు హక్కుల్ని ఫ్యాన్సీ రేట్‌కి సొంతం చేసుకున్నారు.
నోరు జారితే చట్టపరమైన చర్యలు.. గట్టిగా వార్నింగ్ ఇచ్చిన మురుగదాస్!
'నవాబ్'లాంటి సూపర్‌హిట్ తర్వాత మురుగదాస్, విజయ్ సూపర్‌హిట్ కాంబినేషన్ మరో మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇప్పటితమిళంలో విడుదలైన ఫస్ట్‌లుక్‌కి, పాటలకు స్పందన అద్భుతంగా ఉంది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తాం. దీపావళి కానుకగా నవంబర్ 6న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తాం'' అని అశోక్ వల్లభనేని చెప్పారు. ఈ చిత్రానికి ఏ .ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.
ప్రయోగాత్మక చిత్రాలకు ఎ.ఆర్.మురుగదాస్ కేరాఫ్ అడ్రస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కమర్షియల్ అంశాలతోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్, సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట. వైవిధ్యమైన కథలతో ట్రావెల్ చేసే విజయ్‌కు మురుగదాస్‌లాంటి దర్శకుడు దొరికితే అభిమానులకు పండగే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో 'తుపాకీ', 'కత్తి', వంటి విజయవంతమైన చిత్రాలొచ్చాయి. దీపావళికి మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.