మాస్టర్ ఫస్ట్‌లుక్: ఆకర్షిస్తున్న విజయ్ అవతారం! చూస్తుంటే..
ఇటీవలే 'విజిల్' సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన తమిళ సూపర్ స్టార్ ఇళయదళపతి విజయ్ నటిస్తున్న కొత్త చిత్రం 'మాస్టర్'. ఖైదీ చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 9న రిలీజ్‌కి రెడీ అయింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్రయూనిట్.. తాజాగా చిత్ర ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది.
ఈ పోస్టర్‌లో తల పట్టుకొని అసహనంతో కూడిన ఆలోచనతో కనిపిస్తున్నారు విజయ్ ఇంటర్ కట్‌లో, గట్టి హీరోయిజం ఎలివేషన్ ఉన్న లుక్ కూడా యాడ్ చేశారు. ఈ పోస్టర్‌ని పరిశీలించి చూస్తే.. ఒక పక్కకు పిల్లిని ఎత్తుకొని ఉన్న విజయ్‌ని కూడా గమనించవచ్చు. ఏదిఏమైనా ఈ లుక్ 'మాస్టర్' సినిమాపై ఉన్న అంచనాలను రెండింతలు చేసింది.

ఈ చిత్రంలో విజయ్ ప్రత్యేక లక్షణాలు ఉన్నటువంటి చిన్నపిల్లల స్కూల్ మాస్టర్ గా కనిపించనున్నారు. అదేవిధంగా విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తుండడంతో అంచనాలు మరో స్థాయికి చేరాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. విజయ్ సరసన మాళవిక మోహనన్, ఆండ్రియా జెర్మియా నటిస్తున్నారు.
తమిళనాడు రాజకీయ పరిస్థితుల నేపథ్యం టచ్ చేస్తూ.. దానికి సంబంధించిన డైలాగుల రూపంలో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి కొన్ని హింట్స్ ఈ సినిమాతో ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











