twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. మాస్టర్ రిలీజ్ ఎప్పుడంటే..

    |

    వరుస విజయాలతో సంచలనం రేపుతున్న తమిళ సూపర్‌స్టార్ విజయ్ ఆశలపై కరోనా నీళ్లు జల్లింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్న మాస్టర్ సినిమాకు కరోనా లాక్‌డౌన్ అడ్డంకిగా మారింది. వాస్తవానికి మాస్టర్ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్ కారణంగా సినిమా హాళ్లు మూతపడటంతో రిలీజ్ కూడా వాయిదా పడింది.

    లాక్‌డౌన్ పిరియడ్‌ను మాస్టర్ సినిమా ప్రమోషన్స్‌కు ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. మాస్టర్ ట్రైలర్‌ను ఫ్యాన్స్‌కు అందించాలని ప్లాన్ చేశారు. కానీ ఈ పరిస్థితులు రిలీజ్ చేయడం బాగుండదని భావించారు. అయితే లాక్‌డౌన్ ఎత్తివేయగానే సినిమా ట్రైలర్ విడుదల చేసి రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

     Vijays Master movie to release on June 22

    కరోనా నుంచి బయటపడటమే మనముందు ఉన్న ఏకైక లక్ష్యం. మాస్టర్ సెలబ్రేషన్స్ ఆ తర్వాత ప్లాన్ చేద్దాం. మాస్టర్ సినిమా ప్రమోషన్స్ ఈ సమయంలో చేయడం భావ్యం కాదు. సరైన సమయంలో ఫ్యాన్స్ పండుగలాంటి వాతావరణం క్రియేట్ చేద్దామని దర్శకుడు లోకేష్ ట్వీట్ చేశారు.

    అయితే మాస్టర్ సినిమాకు సంబంధించిన ఓ వార్త మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ చిత్రాన్ని విజయ్ పుట్టిన రోజు జూన్ 22న రిలీజ్ చేయాలని యూనిట్ నిర్ణయించారని, ఆ రోజునైతే ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకాలా ఉంటుందనే ఫీలింగ్‌తో ముందుకెళ్తున్నామని యూనిట్ వెల్లడించింది.

    English summary
    Tamil Super star, Thalaiva Vijay's Master to release on his's Birthday June 22nd. Officially its not confirmed, But inside of the film unit revealed the plans of release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X