ఐ యామ్ ఎ కార్పొరేట్ క్రిమినల్.. ఇదే మన సర్కార్.. దుమ్ము దులిపేలా టీజర్!
తమిళ స్టార్ హీరో విజయ్ మరో ప్రభంజనానికి సిద్ధం అవుతున్నాడు. విజయ్ వరుస బ్లాక్ బాస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. త్వరలో సర్కార్ చిత్రంతో విజయ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకుడు. విజయ్, మురుగదాస్ లది సూపర్ హిట్ కాంబినేషన్.
వీరి కాంబోలో ఇప్పటికే కత్తి, తుపాకీ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సర్కార్ చిత్ర టీజర్ విడుదల చేశారు. తమిళంలో ముందుగానీ సర్కార్ టీజర్ విడుదలై అదరగొడుతోంది. తాజాగా తెలుగులో కూడా విడుదల చేశారు. టీజర్ లో విజయ్ నటన, డైలాగ్స్ అదిరిపోయేలా ఉన్నాయి.
ఇంకొక్క రోజులో ఎం జరుగుతుందో, జరగబోతోందో ఓ మూలన కూర్చుని వేడుకలా చూడండి. ఐ యామ్ ఎ కార్పొరేట్ క్రిమినల్ అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో విజయ్ అదరగొడుతున్నాడు. మీ ఊరి నాయకుడిని మీరే కనిపెట్టండి. ఇదే మన సర్కార్ అంటూ మరో డైలాగ్ ఉంది. ఎప్పటిలాగే మురుగదాస్ నుంచి వస్తున్న మరో సందేశాత్మక చిత్రం ఇది. దీపావళి కానుకగా తెలుగు తమిళ భాషల్లో పెద్ద ఎత్తున విడుదల చేయబోతున్నారు.



Click it and Unblock the Notifications











