ఆ సినిమాను చూసి థ్రిల్ అయ్యాడట!.. ముంబైలో విజయ్ సేతుపతి
కోలీవుడ్‌లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చి సూపర్ స్టార్ రేంజ్‌కు ఎదిగాడు విజయ్ సేతుపతి. ఓ సినిమాపై ఎలా ఉంటుంది.. కథ ఎలా ఉంటుంది.. జనాలకు ఎలా నచ్చుతుందనే అంశాలపై ఓ పట్టు ఉంటుంది. అందుకే విజయ్ సేతుపతి నటించిన చిత్రాలు, ఎంచుకునే పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ మధ్యే మాస్టర్ సినిమాలో భవానీ, ఉప్పెన చిత్రంలో రాయనంగా అదరగొట్టేశాడు. అలాంటి విజయ్ సేతుపతి ఇప్పుడు ఓ సినిమా గురించి చెప్పుకొచ్చాడు.
తాజాగా 'A' మూవీ టీంని విజయ్ సేతుపతి అభినందించాడు. నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్ గా యుగంధర్ ముని దర్శకత్వంలో అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన చిత్రం 'A'. ఈ మూవీ ట్రైలర్‌ను విజయ్ సేతుపతి రిలీజ్ చేశాడు. ఆ ట్రైలర్ బాగానే క్లిక్ అయింది. అయితే తాజాగా విజయ్ సేతుపతి ముంబైలో ఉన్నాడు. ఆల్రెడీ బాలీవుడ్‌లో ఓ సినిమా, వెబ్ సిరీస్ కోసం విజయ్ సేతుపతి డేట్స్ ఇచ్చాడన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ముంబై లో ఉన్న విజయ్ సేతుపతి ని చిత్ర బృందం కలిసి తమ సినిమాకు సపోర్ట్ గా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్రంలోని కొంత పార్ట్‌ని చూసి అయన ఎంతో థ్రిల్‌కి గురయ్యాడట. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది భరోసా ఇచ్చాడట. విజయ్ సేతుపతి కామెంట్లతో సినిమాపై అందరికీ అంచనాలు పెరిగాయి. మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ని PVR పిక్చర్స్ ఘనంగా విడుదల చేయబోతోంది.


Click it and Unblock the Notifications











