Ganesh Chaturthi బరిలో లాభం.. విజయ్ సేతుపతి, శృతి హాసన్ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
కరోనావైరస్ సెకండ్ వేవ్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కొంత మేరకు సానుకూల పరిస్థితులు నెలకొనడంతో ఇప్పటి వరకు వేచి చూసిన నిర్మాతలందరూ తమ సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంచి కంటెంట్‌తో వచ్చిన చిన్న చిత్రాలు భారీ విజయాలను అందుకొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం లాభం. ఈ చిత్రంలో దక్షిణాదిలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, శృతిహాసన్ జంటగా నటించారు. ఈ చిత్రం ఏకకాలంలో తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కావడం విశేషం.
తమిళ దర్శకుడు ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహించిన లాభం చిత్రాన్ని శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. లాయర్ శ్రీరామ్ సమర్పణలో హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం వినాయక చవితి సందర్భంగా అంటే సెప్టెంబర్ 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాబోతున్నది.

ఇక మాస్టర్ చిత్రం తర్వాత విజయ్ సేతుపతి నటించిన ఉప్పెన చిత్రం థియేటర్లలో రిలీజై భారీ విజయాన్ని అందుకొన్నది. విజయ్ సేతుపతి నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఉప్పెన సినిమాను కేవలం తన భుజాలపై సక్సెస్ బాట పట్టించారనే అభిప్రాయ వ్యక్తమైంది. అలాగే లాక్‌డౌన్ తర్వాత థియేటర్‌లో వచ్చిన క్రాక్ సినిమాతో శృతిహాసన్ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా నటనపరంగా మంచి మార్కులను సొంతం చేసుకొన్నది. ఇలాంటి క్రేజీ జంట నటించిన లాభం చిత్రంపై ట్రేడ్ వర్గాల్లోను, ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు నెలకొన్నాయి.
లాభం సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో నిర్మాతలు మాట్లాడుతూ... విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా నటించిన లాభం చిత్రం సెప్టెంబర్ 9న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కావడం విశేషం. మాస్టర్, ఉప్పెన తర్వాత విజయ్ సేతుపతి నటించిన పక్కా కమర్షియల్ చిత్రం ఇది. కథాపరంగా ఇందులోని భావోద్వేగాలు ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకొంటాయి. విజయ్ సేతుపతి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఈ సినిమా థియేటర్‌లోనే ప్రేక్షకులకు చూపించాలన్న ఉద్దేశంతోనే సరైన సమయం కోసం వేచి చూశాం అని అన్నారు.

నటీనటులు: విజయ్ సేతుపతి, శృతి హాసన్, జగపతిబాబు, సాయి ధన్సిక, కలైయ రాసన్, రమేష్ తిలక్, పృథ్వీ రాజన్, డేనియల్ అన్నే పోపే, నితీష్ వీర, జయ్ వర్మన్ తదితరులు
రచన, దర్శకత్వం: ఎస్పీ జన నాథన్
స్క్రీన్ ప్లే: ఎన్ కల్యాణ కృష్ణన్
మ్యూజిక్: డీ ఇమామ్
డీవోపి: రాంజీ
ఎడిటర్: ఎన్ గణేష్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్: వీ సెల్వకుమార్
స్టంట్: ధన అశోక్
పీఆర్వో: శ్రీ మారి
మాటలు: రాజేష్ ఏ మూర్తి
పాటలు రాజ శ్రీ సుధాకర్
రిలీజ్ డేట్: 2021-09-09


Click it and Unblock the Notifications











