ఉప్పెన అప్‌డేట్.. విజయ్ సేతుపతి లుక్ వచ్చేస్తోంది
హీరోలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది మెగాఫ్యామిలీ. ఇప్పటికే అరడజనుకుపైగా హీరోలు ఈ ఫ్యామిలీ నుంచి వచ్చి కోట్ల మంది మెగా అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా ఎంట్రీ ఇవ్వబోతోన్న సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రానికి ఉప్పెన అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు విడుదల చేసిన పోస్టర్ ఏ రేంజ్‌లో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ మధ్యే విడుదల చేసిన ఉప్పెన ఫస్ట్ వేవ్‌కు ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇందులో హీరోను, హీరోయిన్‌ను మాత్రం అంతగా రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారు. ఇప్పటికే వైష్ణవ్ తేజ్‌కు సంబంధించిన రెండు పోస్టర్లు విడుదల చేస్తే అందులో మొహం కనబడకుండానే జాగ్రత్త పడ్డారు. అయితే తాజాగా ఈ మూవీలో విలన్ పాత్రను పోషిస్తున్న విజయ్ సేతుపతిని చూసే టైమ్ వచ్చేసింది.

ఉప్పెన చిత్రంలో విజయ్ సేతుపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ నాట హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విభిన్న పాత్రలకు ప్రాణం పోసే నటుడిగా బిజీ అయిన విజయ్ సేతుపతిని ఉప్పెన సినిమాలో తీసుకుని అమాంతం అంచనాలు పెంచేశారు. ఇక ఈ మూవీలోని విజయ్ సేతుపతి లుక్‌ను రేపు (ఫిబ్రవరి 10) సాయంత్రం 04:05గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మూవీ ఏప్రిల్ 2న విడుదల కానున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











