"పుష్ప 2" రికార్డ్స్ బ్రేక్.. విజయ్ సేతుపతి సినిమాకి ఊహించని రిలీజ్.. 500 కోట్లు గ్యారెంటీనా?

ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఇండియన్ సినిమా హవా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారీ హైప్ నడుమ ఎన్నో సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా రికార్డు థియేటర్స్ అండ్ స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇండియన్ సినిమా స్పాన్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇతర దేశాల్లో కూడా మన సినిమాలకి డిమాండ్ పెద్ద ఎత్తున పెరుగుతోంది.

అయితే దాదాపు మన సినిమాలు బయట దేశాల్లో యూఎస్, యూకే, జపాన్ , ఆస్ట్రేలియా సహా కొన్ని అరబ్ దేశాల్లో విడుదల అవుతూ ఉంటాయి. కాగా ఇప్పటి వరకు మన ఇండియన్ సినిమా నుంచి RRR బహుశా 11 వేల స్క్రీన్స్ లో వరల్డ్ వైడ్ గా విడుదలై సంచలనం సృష్టించింది. రీసెంట్ టైం లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

vijay sethupathi maharaja got a record screen release in china with 40k

అయితే దీనిని వరల్డ్ వైడ్ గా పుష్ప 2 తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏకంగా 12 వేల 500 స్క్రీన్స్ తో బ్రేక్ చేయబోతున్నాడు అని టాక్ వచ్చింది. దీనితో ఇదే భారీ రికార్డు అనుకుంటే దీనికి షాకిచ్చేలా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన రీసెంట్ హిట్ సినిమా "మహారాజ" ఏకంగా 40 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తూ రికార్డు సెట్ చేసారు. కొన్ని రోజులు క్రితమే ఈ థ్రిల్లర్ రివెంజ్ డ్రామాని చైనాలో విడుదల చేస్తున్నట్టుగా విజయ్ సేతుపతి స్వయంగా అనౌన్స్ చేసాడు.

కాగా ఇపుడు ఈ సినిమా అక్కడ ఏకంగా 40 వేల స్క్రీన్స్ కి పైగా రిలీజ్ అంటే ఇది ఊహించని నెంబర్ అని చెప్పాలి. దీనికి ముందు వెళ్లిన అమీర్‌ఖాన్ "దంగల్" చైనాలో ఎలాంటి రికార్డ్స్ సెట్ చేసిందో తెలిసిందే. కాగా దంగల్ అప్పుడులో కేవలం 9000 స్క్రీన్స్ లో మాత్రమే విడుదల అయ్యింది. కానీ మహారాజ సినిమాకి ఈ రేంజ్ లో స్క్రీన్స్ దక్కడంతో ఇదొక రికార్డు బ్రేకింగ్ విడుదల అని చెప్పొచ్చు.

ఒకవేళ ఇదే ఊపులో అక్కడ టాక్ కూడా బాగుండి జనం ఆదరిస్తే మాత్రం ఈజీగా రూ.500 కోట్ల వసూళ్లు ఈ తమిళ సినిమాకి దక్కుతాయని టాక్ నడుస్తుంది. మరి మహారాజ సినిమా చైనా "కర్మ" అనే యూనివర్సల్ టైటిల్ తో విడుదల కాబోతుండగా అక్కడ ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది.

అయితే దీనికి ముందు తమిళ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ శంకర్ ల భారీ విజువల్ ట్రీట్ చిత్రం 2.0 ఏకంగా 47 వేలకి పైగా స్క్రీన్స్ లో విడుదల అయ్యింది. మళ్ళీ ఇపుడు విజయ్ సేతుపతి సినిమా 40 వేలకి పైగా స్క్రీన్స్ లో వెళుతుంది. ఇలా మొత్తానికి అయితే ఇండియన్ సినిమా నుంచి హైయెస్ట్ స్క్రీన్స్ లో విడుదల అయ్యిన సినిమాలుగా ఇవి రికార్డ్స్ సృష్టించాయని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X