Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆకట్టుకుంటోన్న A ట్రైలర్.. విజయ్ సేతుపతితో ప్రమోషన్స్!
ఓ చిన్న సినిమాను అందరికీ చేరేలా చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ అదే ఒక పెద్ద స్టార్‌తో ట్రైలర్ రిలీజ్ చేయిస్తే అందరికీ చేరుతుంది. తాజాగా ఓ విభిన్న చిత్రం A ట్రైలర్‌ను విజయ్ సేతుపతి విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్ గా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై యుగంధర్ ముని దర్శకత్వంలో గీతా మిన్సాల నిర్మించిన థ్రిల్లర్ చిత్రం A.
జ్వరం వస్తే పారాసిట్మాల్ ట్యాబ్లెట్ వేసుకుంటాం.. కానీ ఆ టాబ్లెట్ తయారుకావడానిక ఎంతో మంది చనిపోయారంటూ చెప్పడంతో ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపిస్తుంది.. ఒకే కల పదే పదే రావడం, ఆ కలకు సినిమాకు ఏదో సంబంధం ఉందని చూపించడంతో ఇది సస్పెన్స్ థ్రిల్లర్‌లా అనిపిస్తోంది. మొత్తానికి ఇలా సినిమాపై మాత్రం ట్రైలర్‌తో ఆసక్లిని పెంచేలే మంచి ప్లాన్ వేసింది చిత్రయూనిట్.
A చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన విజయ్ సేతుపతి ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వేసవి కానుకగా ఈ మూవీ మార్చి 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈసినిమాకు విజయ్ కురాకుల సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా విశేషంగా దూసుకుపోతోంది.