twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆకట్టుకుంటోన్న A ట్రైలర్.. విజయ్ సేతుపతితో ప్రమోషన్స్!

    |

    ఓ చిన్న సినిమాను అందరికీ చేరేలా చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ అదే ఒక పెద్ద స్టార్‌తో ట్రైలర్ రిలీజ్ చేయిస్తే అందరికీ చేరుతుంది. తాజాగా ఓ విభిన్న చిత్రం A ట్రైలర్‌ను విజయ్ సేతుపతి విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్ గా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై యుగంధర్ ముని దర్శకత్వంలో గీతా మిన్సాల నిర్మించిన థ్రిల్లర్ చిత్రం A.

    జ్వరం వస్తే పారాసిట్‌మాల్ ట్యాబ్లెట్ వేసుకుంటాం.. కానీ ఆ టాబ్లెట్ తయారుకావడానిక ఎంతో మంది చనిపోయారంటూ చెప్పడంతో ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపిస్తుంది.. ఒకే కల పదే పదే రావడం, ఆ కలకు సినిమాకు ఏదో సంబంధం ఉందని చూపించడంతో ఇది సస్పెన్స్ థ్రిల్లర్‌లా అనిపిస్తోంది. మొత్తానికి ఇలా సినిమాపై మాత్రం ట్రైలర్‌తో ఆసక్లిని పెంచేలే మంచి ప్లాన్ వేసింది చిత్రయూనిట్.

    Vijay sethupathi Release A Movie trailer

    A చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన విజయ్ సేతుపతి ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వేసవి కానుకగా ఈ మూవీ మార్చి 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈసినిమాకు విజయ్ కురాకుల సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా విశేషంగా దూసుకుపోతోంది.

    English summary
    Vijay sethupathi Release A Movie trailer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X