కార్పోరేట్ మాఫియాపై విజయ్ సేతుపతి విమర్శనాస్త్రం.. రైతు సమస్యలతో లాభం..
తమిళ దర్శకుడు ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహించిన లాభం చిత్రాన్ని శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. లాయర్ శ్రీరామ్ సమర్పణలో హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం వినాయక చవితి సందర్భంగా అంటే సెప్టెంబర్ 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాబోతున్నది.

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, అందాల తార శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం లాభం. ఏకకాలంలో రెండు భాషల్లోనూ సినిమా విడుదలవుతుంది. ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్పీ జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లాయర్ శ్రీరామ్ సమర్పణలో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) తెలుగులో విడుదల చేస్తున్నారు. హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న సినిమాను విడుదల చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ను విజయ్ సేతుపతి విడుదల చేయగా అనూహ్యమైన స్పందన వచ్చింది. దీంతో విజయ్ సేతుపతి, శృతిహాసన్ నటించిన చిత్రానికి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ... "ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సినిమాను నా సొంత బ్యానర్‌లో నిర్మించాను. కథ చాలా కొత్తగా ఉంటుంది. సమాజానికి ఓ సందేశం ఇచ్చేలా సినిమాను తీశాం. రైతులు ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధర సమస్య, వ్యవసాయ భూముల పైనా... పంటలపైనా కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యం, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపైనా చాలా స్పష్టంగా ఇందులో చూపించడం జరిగింది. ట్రైలర్‌లో కూడా అదే చూపించాం. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాతలకు నా అభినందనలు అని అన్నారు

నిర్మాతలు మాట్లాడుతూ ''విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా నటించిన లాభం చిత్రం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతుంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాను అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ బ్యానర్‌పై తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండటం హ్యాపీగా ఉంది. విజయ్ సేతుపతి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది ' అన్నారు.
నటీనటులు: విజయ్ సేతుపతి, శృతి హాసన్, జగపతిబాబు, సాయి ధన్సిక, కలైయ రాసన్, రమేష్ తిలక్, పృథ్వీ రాజన్, డేనియల్ అన్నే పోపే, నితీష్ వీర, జయ్ వర్మన్ తదితరులు
రచన, దర్శకత్వం: ఎస్పీ జననాథన్
స్క్రీన్ ప్లే: ఎన్ కల్యాణ కృష్ణన్
మ్యూజిక్: డీ ఇమామ్
డీవోపి: రాంజీ
ఎడిటర్: ఎన్ గణేష్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్: వీ సెల్వకుమార్
స్టంట్: ధన అశోక్
పీఆర్వో: శ్రీ మారి
మాటలు: రాజేష్ ఏ మూర్తి
పాటలు రాజ శ్రీ సుధాకర్
రిలీజ్ డేట్: 2021-09-09


Click it and Unblock the Notifications











