Varisu Twitter Review: విజయ్ మూవీకి షాకింగ్ టాక్.. అసలైందే మిస్ చేసి.. తమిళంలోనే ఇలా ఉంటే!
విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలను చేస్తూ దక్షిణ భారతదేశం మొత్తంలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో ఇళయదళపతి విజయ్. సినిమా సినిమాకూ తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తోన్న ఈ స్టార్ హీరో.. రెట్టించిన ఉత్సాహంతో వరుసగా ప్రాజెక్టులను చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో 'వారిసు' అనే సినిమాను చేశాడు. ఈ తమిళ వెర్షన్ నేడే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వస్తుందో ఓ లుక్కేద్దాం పదండి మరి!

వారసుడుగా ఎంటరైన విజయ్
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రమే 'వారసుడు'. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇందులో శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కుస్భూ, జయసుధ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

అలాంటి కథ.. తెలుగులో లేట్
కష్టాల్లో చిక్కుకున్న ఓ కార్పోరేట్ దిగ్గజం తరపున వారసుడు ఎంట్రీ ఇచ్చి ప్రత్యర్థుల ఆగడాలను ఎలా ఆటకట్టించారు అన్న కథాంశంతో 'వారిసు' మూవీ రూపొందింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అన్ని ప్రచార చిత్రాలకు భారీ స్థాయిలోనే రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ సినిమా తెలుగు వెర్షన్ 'వారసుడు'ను జనవరి 14వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ట్విట్టర్‌లో మూవీకి టాక్ ఇలా
విజయ్ నటించిన 'వారిసు' మూవీ ఎన్నో అంచనాల నడుమ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా ఏరియాల్లో ఈ సినిమా షోలు పడ్డాయి. దీంతో ట్విట్టర్ వేదికగా చాలా మంది ఈ సినిమాపై తమ అభిప్రాయాలు చెప్తున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. నెటిజన్ల నుంచి మాత్రం ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ మాత్రమే దక్కుతుందని చెప్పొచ్చు.
ఫస్టాఫ్ సోసోగానే అంటూ
ఇళయదళపతి విజయ్ నటించిన 'వారిసు' మూవీని వీక్షించిన ఓ నెటిజన్ 'వారిసు మూవీ మొదటి భాగం అంతా మామూలు కుటుంబ కథా చిత్రంలా అనిపించింది. అంతేకాదు, చాలా నెమ్మదిగా సాగుతూ సీరియల్‌ను తలపించింది. కొన్ని కామెడీ సీన్స్‌తో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్ తప్ప మిగిలిన భాగం అంతా సాదాసీదాగానే సాగుతుంది' అంటూ చెప్పుకొచ్చాడు.
సెకెండాఫ్ అదుర్స్ అంటూ
విజయ్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో రూపొందిన 'వారిసు' మూవీపై మరో నెటిజన్ 'వారిసు మూవీ సంతృప్తిని మిగిల్చే ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఫస్టాఫ్ సోసోగానే ఉన్నా.. సెకెండాఫ్ మాత్రం మంచి కమర్షియల్ హంగులతో బాగుంది. ఎమోషనల్ సీన్స్ అంతగా ఆకట్టుకోకున్నా సెకెండాఫ్‌లో విజయ్ కామెడీ, యాక్షన్ సినిమాను నిలబెట్టాయి' అంటూ అభిప్రాయపడ్డాడు.
విజయ్‌తో వంశీ సేఫ్ గేమ్
'వారసు' చిత్రాన్ని చూసిన ఇంకో నెటిజన్ ట్విట్టర్‌లో 'వారిసు డీసెంట్‌గా నడిచే ఫ్యామిలీ డ్రామా. విజయ్ తన స్టైల్స్, డ్యాన్స్, యాటిట్యూడ్, స్వాగ్‌తో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రష్మిక పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. ఇక, దర్శకుడు వంశీ.. విజయ్ బలంతో సేఫ్ గేమ్ ఆడాడు. థమన్ మ్యూజిక్ మాత్రం అద్భుతంగా ఉంది' అంటూ ఓ పోస్టులో కామెంట్స్ చేశాడు.

ఆ ముగ్గురి గురించే టాక్
క్రేజీ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'వారిసు' చిత్రంలో హీరో విజయ్ వన్ మ్యాన్ షో చేశాడని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. అంతేకాదు, అతడు తనదైన శైలిలో ప్రేక్షకులను, ఫ్యాన్స్‌ను అలరించాడని చెప్పాడు. అలాగే, దర్శకుడు వంశీ పైడిపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టారని ప్రశంసలు కురిపించాడు.

అదే మిస్ అంటూ ట్వీట్లు
ఇక, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ నటించిన 'వారిసు' మూవీని వీక్షించిన వాళ్లందరూ ఇందులో ఎంతో ముఖ్యమైన ఎమోషనల్ పార్ట్ సరిగా రాలేదని చెబుతున్నారు. సెంటిమెంట్ సన్నివేశాలు టీవీ సీరియల్ కంటే దారుణంగా ఉన్నాయని కొందరు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఇప్పుడీ అంశం తెగ హైలైట్ అవుతోంది. కానీ, వేరు విభాగాల్లో అదిరిపోయిందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











