Thalapathy 66: అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. విజయ్ ప్లాన్ రెడీ!
కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు టాలీవుడ్ మార్కెట్ పై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే రజనీకాంత్ కమల్ హాసన్ తర్వాత సూర్య విక్రమ్ కార్తీ వంటి వారు మంచి విజయాలు అందుకున్నారు. అయితే వీరి తర్వాత ఎవరు కూడా మళ్లీ ఆ స్థాయిలో మార్కెట్ను సొంతం చేసుకోలేకపోయారు. విభిన్నమైన సినిమాలను చేస్తేనే తెలుగులో మంచి విజయాలను అందుకుంటున్నారు. గత కొంతకాలంగా విజయ్ కూడా తెలుగు మార్కెట్ పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడు. త్వరలోనే తలపతి 66వ సినిమా తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ ను విజయ్.తెలుగు డైరెక్టర్ తోనే చేస్తున్నాడు. ఇన్ని రోజులు ఈ సినిమా వస్తుందా లేదా అని అనుకుంటున్న తరుణంలో దర్శకుడు దర్శకుడు క్లారిటీ చేశాడు.

50% ఆక్యుపెన్సీతోనే బాక్సాఫీస్ హిట్
కోలీవుడ్లో ప్రస్తుతం రజనీకాంత్ కంటే ఎక్కువ స్థాయిలో మార్కెట్ సెట్ చేసుకుంటున్న ఏకైక హీరో విజయ్ తళపతి. అతని మార్కెట్ సినిమా సినిమాకు పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది మొదట్లో మాస్టర్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న ఏకైక సినిమా మాస్టర్. ఆ సినిమా తెలుగులో కూడా విజయ్ కు మంచి మార్కెట్ సెట్ చేసింది. 50% ఆక్యుపెన్సీ సమయంలోనే సినిమా భారీ కలెక్షన్స్ అందుకోవడం విశేషం.

తెలుగు వారితో బడా మూవీ
ముఖ్యంగా తెలుగులో విజయ్ కు మాస్టర్ సినిమాతో మంచి ఓపెనింగ్స్ రావడంతో భవిష్యత్ సినిమాల వసూళ్లు కూడా ఏ స్థాయిలో ఉంటాయో ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. తప్పకుండా భవిష్యత్తులో మరిన్ని సినిమాలను డబ్ చేసేందుకు అడుగులు వేస్తున్నాడు. అయితే అలా చేయడం కంటే కూడా ద్విభాషా సినిమా చూస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని ఏకంగా తెలుగు దర్శకుడితో ఒక ప్రాజెక్టును సెట్ చేసుకున్నారు. అంతేకాకుండా ఆ సినిమా తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండడం విశేషం.

మహేష్ తో చేయాలనుకున్న కథ
ఊపిరి మహర్షి వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తన తదుపరి సినిమా కోలీవుడ్ స్టార్ విజయ్ తో చేయబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశాడు. అసలైతే మహర్షి సినిమా అనంతరం వంశీ పైడిపల్లితో సినిమా చేయాలనుకున్నాడు. కానీ మహేష్ బాబు వంశీ ప్రాజెక్టుకు ఎందుదో గ్రీన్సిగ్నల్ ఇవ్వలేదు. ఇప్పుడు అదే కథను వంశీ పైడిపల్లి విజయ్ కు చెప్పగా అతను ఒప్పేసుకున్నట్లు సమాచారం. విజయ్ కు నచ్చినట్లుగా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ను కూడా కథలు కొత్త గా మార్చినట్లు తెలుస్తోంది.
Recommended Video

ఆ సినిమా తరువాత..
ఇక ఈ సినిమాలు వీలైనంత త్వరగా సెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ బీస్ట్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఒకేసారి తెలుగులో విడుదల చేయనున్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తవగానే విజయ్ వంశీ పైడిపల్లి ప్రాజెక్టును పట్టాలెక్కించానున్నాడు.


Click it and Unblock the Notifications











