విజయ్ దళపతి డ్యూయల్ రోల్.. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ రిలీజ్ ఎప్పుడంటే?

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకునే ఈయనకు.. కేవలం తమిళంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తెలుగులో కూడా చాలా మంది ఆయనను చాలా ఇష్టపడుతుంటారు. అందుకే ఆయన తమిళంలో చేసిన చాలా చిత్రాలు తెలుగులో కూడా డబ్ అవుతుంటాయి. ఇక్కడ కూడా హిట్లుగా నిలుస్తుంటాయి. అయితే ఆయన హీరోగా మరో కొత్త సినిమా రాబోతుంది. ఈ సినిమా పేరే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ఫిక్స్ చేశారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అనే సినిమాలో విజయ్ దళపతి డబుల్ యాక్షన్ చేయబోతున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించబోతున్న ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జానర్ లో రాబోతున్న ఈ సినిమాలో విజయ్ దళపతితో పాటు ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, పార్వతి నాయర్, మోహన్, జయరామ్, అజ్మల్ అమీర్, యోగి బాబు, వీటీవీ గణేష్, వైభవ్, ప్రేమ్గీ అమరెన్, అరవింద్, అజయ్ రాజ్, గంజాయి కరుప్పు తదితరులు నటించబోతున్నారు. ఇంతమంది స్టార్ నటుల కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి.

Vijay Thalapathy GOAT The Greatest of All Time Movie Release Date Fixed Check Details

అలాగే యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. సిద్దార్థ్ రవి సినిమాటోగ్రాఫర్ గా, వెంకట్ రాజన్ ఎడిటింగ్ బాధ్యతలు చేపడుతున్నారు. ఒక్క తమిళంలోనే కాకుండా ఈ సినిమా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే విజయ్ దళపతి ద్విపాత్రాభినయం చేయబోతున్న ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటికే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రాన్ని ఇదే ఏడాది జూన్ లో రిలీజ్ చేయునున్నట్లు సమాచారం.

Vijay Thalapathy GOAT The Greatest of All Time Movie Release Date Fixed Check Details

మరీ ముఖ్యంగా అదే నెలలో హీరో విజయ్ దళపతి పుట్టిన రోజు ఉండడంతో.. అంతా అదే తేదీన విడుదల చేస్తారని అనుకుంటున్నారు. జూన్ లోనే ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తున్నప్పటికీ.. తేదీని మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. కానీ విజయ్ పుట్టిన రోజు జూన్ 22 కావడంతో అదే రోజు వచ్చే ఛాన్స్ ఉందని.. లేదంటే ఈరోజు శనివారం కావడంతో బర్త్ డే సందర్బంగా ఒకరోజు ముందు అంటే 21వ తేదీ రోజు అయినా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X