తమన్నాతో బ్రేకప్.. రిలేషన్ అంటే ఒక ఐస్‌క్రీమ్.. విజయ్ వర్మ షాకింగ్ రియాక్షన్
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన అంశం తమన్నా - విజయ్ వర్మల బ్రేకప్. రోజులు గడుస్తున్నా ఈ జంట ఎందుకు విడిపోయింది? అన్నదానిపై నేటికీ సరైన క్లారిటీ లేదు.. త్వరలో పెళ్లి చేసుకుంటారనుకున్న విజయ్, తమన్నాలు ఎవ్వరూ ఊహించని విధంగా విడిపోయారు. తొలుత వీరి బ్రేకప్ వార్తలు ఎవ్వరూ నమ్మలేదు.. కానీ తర్వాత పరిస్ధితులను చూసి అందరికీ భ్రమలు తొలగిపోయాయి. ఇప్పుడు ఇద్దరి దారులు వేరు వేరు అయ్యాయి. ప్రస్తుతానికి ఇద్దరూ కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో బ్రేకప్, రిలేషన్‌పై విజయ్ వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ సమయంలో విజయ్ - తమన్నాలు ప్రేమలో పడ్డారు. తర్వాత ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో మీడియాకు తేడా కొట్టింది. తమన్నానే ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ని ఇష్టపడుతున్నానని.. అతని వ్యక్తిత్వం గురించి ప్రస్తావించింది. విజయ్ వర్మ కూడా తమన్నాతో ప్రేమాయణంపై ఓపెన్ అయ్యారు. నాటి నుంచి ఇద్దరూ జంటగా కనిపించేవారు. పార్టీలు, ఫంక్షన్‌లు, వెకేషన్‌లకు లెక్కేలేదు. ఇక రేపో మాపో పెళ్లి ఖచ్చితంగా చేసుకుంటారని అనుకుంటున్న సమయంలో షాకిచ్చింది ఆ జంట.

విడివిడిగా కనిపించడంతో పాటు వీరిద్దరి సోషల్ మీడియా ఖాతాలు తేడా కొట్టడంతో ఏదో జరుగుతోందని మీడియా అనుమానించింది. చివరికి ఈ జంట విడిపోయినట్లుగా సంకేతాలు వచ్చాయి. పెళ్లికి తమన్నా తొందరపడగా.. కెరీరే తనకు ముఖ్యమని విజయ్ వర్మ పట్టుదలగా ఉండటంతో ఇద్దరి మధ్య బ్రేకప్ అనివార్యమైందని బీటౌన్ మీడియా పేర్కొంది. విడిపోయినప్పటికీ పలు ఈవెంట్లకు విడి విడిగానే హాజరై షాకిచ్చారు తమన్నా, విజయ్. దీంతో అసలు వీరిద్దరూ విడిపోయారా? లేదా? అన్న డౌట్ కూడా వచ్చింది.
ఇక రిలేషన్‌పై తమన్నా చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి. ప్రేమలో నిజాయితీ ఉండాలని.. అది వ్యాపారంగా మారకూడదని ఆమె హాట్ కామెంట్స్ చేశారు. భాగస్వామిని ఎంచుకునే సమయంలో మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలని తమన్నా యువతకు పిలుపునిచ్చారు. రిలేషన్‌లో ఉన్నప్పటి కంటే.. లేనప్పుడే తాను ఎంతో సంతోషంగా ఉన్నానని మిల్కీబ్యూటీ పేర్కొన్నారు. ప్రస్తుతం తమన్నా ఓదెల 2లో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన వస్తోంది.
తాజాగా పెళ్లి, రిలేషన్, ప్రేమపై విజయ్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన .. రిలేషన్‌షిప్‌ను ఐస్‌క్రీమ్ మాదిరిగా అభివర్ణించారు. ఆనందం, బాధ, కోపం, చిరాకు ఇలా ప్రతి ఎమోషన్‌ను ఐస్‌క్రీమ్ మాదిరిగా చివరి వరకు ఆస్వాదించాలని విజయ్ తెలిపారు. ఒక బంధాన్ని శాశ్వతం చేసుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా స్వీకరించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం విజయ్ వర్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











