తమన్నాను అలా ట్రాప్ చేశా..లవ్ ప్రపోజల్ ను ఎలా ఒప్పించానంటే?
సౌత్ ఇండియా సినిమా దగ్గర కెరీర్ స్టార్ట్ చేసి బాలీవుడ్ మార్కెట్ లో స్థిరపడ్డ అతి కొద్ది మంది హీరోయిన్స్ లో మిల్కి బ్యూటీ తమన్నా కూడా ఒకామె అని చెప్పాలి. సౌత్ లో ముందు సెకండ్ హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి నెమ్మదిగా తన టాలెంట్ తో బడా ఆఫర్స్ ని ఆమె అందుకుంది. అక్కడ నుంచి తెలుగు, తమిళ్ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.
ఆ సమయంలోనే హిందీలో కూడా పలు సినిమాలు చేసింది కానీ పూర్తి దృష్టి మాత్రం సౌత్ నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. కాగా ఇప్పుడు మాత్రం తమన్నా దృష్టంతా నార్త్ వైపే ఉందని చెప్పాలి. ఇప్పుడు దక్షిణాది సినిమా దగ్గర హీరోయిన్స్ సంఖ్య కూడా పెరగడంతో డిమాండ్ కూడా మారింది. ఇలా ఇక తమన్నా వెబ్ సిరీస్ లు వెబ్ షోస్ కూడా స్టార్ట్ చేసింది.

మరి ఇలా చేసిన ఓ ఒరిజినల్ వెబ్ సినిమాతోనే తన లైఫ్ లో లవ్ స్టోరీ మొదలు పెట్టింది. హిందీలో లస్ట్ స్టోరీస్ 2 అనే అడల్ట్ అంథాలజీ సినిమాలో నటించిన తమన్నా ఆ సినిమాలో బాలీవుడ్ నటుడు విజయ్ వెర్మతో మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే అంతకు ముందు నుంచే వీరు డేటింగ్ లో ఉన్నారా? అసలు వీరి కథంతా ఎక్కడ నుంచి మొదలయిందో ఆమె ప్రియుడు విజయ్ వెర్మ లేటెస్ట్ గా రివీల్ చేసాడు.
తనకి తమన్నా అంటే ఎంతో ప్రేమ అని ఇద్దరు కూడా ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకుంటున్నాం అని చెప్పుకొచ్చాడు. అలాగే తమ ఇద్దరి పరిచయం లస్ట్ స్టోరీస్ 2 నుంచే మొదలయ్యింది అని క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమా షూటింగ్ లోనే తమ పరిచయం డేటింగ్ ఆ తర్వాత ప్రేమగా మారింది అని తెలిపాడు. అయితే లస్ట్ స్టోరీస్ పూర్తయ్యాక కేవలం 20 నుంచి 25 రోజుల్లోనే తమ మొదటి డేటింగ్ కి తమన్నా ఓకే చెప్పేసింది అని అసలు మేటర్ రివీల్ చేసాడు.

అక్కడ నుంచి తాము చాలా సార్లు కలుసుకునేవాళ్ళం అని నేను కూడా తమన్నా కుటుంబీకులని కలిసేవాడిని అని వారికి కూడా నేను నచ్చడంతో అలా తమ బంధం మరింత బలపడింది అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి అయితే ఇలా వీరి కథ లస్ట్ స్టోరీస్ నుంచి లవ్ స్టోరీగా మారింది అని చెప్పాలి. మరి ఈ జంట ఎప్పుడు పెళ్లి శుభవార్త చెబుతుందో అని వారి ఫాలోవర్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాగా తమన్నా ఇప్పుడు తెలుగులో ఓదెల 2 అనే సినిమా చేస్తుండగా బాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్ లు చేస్తుంది అలాగే విజయ్ వెర్మ ముఖ్య పాత్రలో నటించిన రీసెంట్ క్రేజీ అండ్ యాక్షన్ డ్రామా సిరీస్ "మిర్జాపూర్ సీజన్ 3" అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చింది. అలాగే తమన్నా నటించిన తమిళ హారర్ చిత్రం "బాక్" డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది.


Click it and Unblock the Notifications











