వెర్రెక్కిద్దాం అంటూ సోషల్ మీడియాను ఊపేశాడు.. ఇండియాలోనే ట్రెండింగ్‌

ఇళయ దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం బిగిల్. అట్లీ దర్శకత్వంలో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయిన విజయ్.. ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేసేందుకు సిద్దమయ్యాడు. రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే.

తేరి, మెర్సెల్ అంటూ వరుస బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన అట్లీ, విజయ్.. హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమయ్యాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించిన ఈ మూవీ విజయ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంది. ముందు రెండు సినిమాల కంటే ఈ మూవీలోనే మరింత యాక్షన్ సీన్స్‌తో అభిమానులకు కనువిందు చేసేలా కనిపిస్తున్నాడు.

మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన తుపాకి చిత్రంలో తెలుగులో విజయ్ మార్కెట్‌కు దారులు తెరుచుకున్నాయి. అయితే మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ కొట్టలేకపోయాడు. మళ్లీ ఈ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఈ చిత్రాన్ని తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు రంగం సిద్దం చేశారు.

Vijay Whistle Movie First Single Verrekkiddam Released

దీనిలో భాగంగా నేటి సాయంత్రం విజిల్ సినిమాలోని మొదటి పాటను రిలీజ్ చేశారు. వెర్రెక్కిద్దాం అంటూ ఏ ఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన పాటను విడుదల చేశారు. రాకేందు మౌళి రచించిన ఈ పాటను రేవంత్ పాడారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కళాపతి ఎస్ అఘోరం ఈ సినిమాను నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X