నో డ్రింక్.. నో గర్ల్స్.. విజయ్ దేవరకొండ ‘మీతో మాత్రమే చెబుతా’ టీజర్ ఎలా ఉందంటే..
టాలీవుడ్‌లో సంచలన కెరటంలా ఎగిసిన హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డికి ముందు రిలీజైన పెళ్లిచూపులు సినిమాతో విజయ్ దేవరకొండ మంచి గుర్తింపు తెచ్చుకొన్నాడు. పెళ్లి చూపులు సినిమా రిలీజ్‌కు ముందు ఎదురైన చేదు అనుభవాలు, గుణపాఠాలను దృష్టిపెట్టుకొన్న విజయ్ దేవరకొండ ఎప్పటికైనా నిర్మాతగా మారాలని ఒట్టు వేసుకొన్నాడట. ఆ క్రమంలోనే కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తరుణ్ భాస్కర్, అనసూయ లాంటి తారలతో సినిమాను ప్రారంభించారు.
ప్రతీ ఫోన్‌లో సీక్రెట్ అంటూ
కొద్దిరోజలు క్రితం ఆ సినిమాకు ‘మీతో మాత్రమే చెబుతా' అంటూ ఆసక్తికరమైన టైటిల్‌ను ప్రకటించారు. ఎవ్రీ ఫోన్ హ్యాజ్ ఇట్స్ సీక్రెట్స్ అనేది ట్యాగ్ లైన్. తరుణ్ భాస్కర్,అభినవ్ గోమటం లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ మూవీ లోఅనసూయ భరద్వాజ్,వాణి భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆ టీజర్ ఎలా ఉందంటే..

పక్కాగా వినోదంతో
తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ టైటిల్‌కు తగ్గట్టుగానే ఫన్‌తో కూడిన ఎంటర్టైనర్‌గా ఉండబోతోందని టీజర్ చూస్తేనే తెలుస్తుంది. ‘‘మీకు మాత్రమే చెప్తా'' అనే క్యాచీ టైటిల్ తో వస్తోన్న ఈ మూవీ టీజర్‌తోనే ప్రామిసింగ్ మూవీ అనిపించుకుంటోంది. చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న మంచి ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. ఇక థియేటర్ లో పూర్తిగా నవ్వులు పంచేందుకు మూవీ టీమ్ రెడీ అవుతోంది.

అక్టోబర్‌లో రిలీజ్
మీతో మాత్రమే చెబుతా సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌ను భారీగా చేసేందుకు నిర్మాత విజయ్ దేవరకొండ టీమ్ ప్లాన్ చేసినట్టు సమాచారం.

తెర ముందు, తెర వెనుక
నటీనటులు: తరుణ్ భాస్కర్, అనసూయ భరద్వాజ్, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ, జీవన్ తదితరులు
సినిమాటోగ్రఫీ : మదన్ గుణదేవా,
సంగీతం : శివకుమార్,
ఆర్ట్ డైరెక్టర్: రాజ్ కుమార్,
కో డైరెక్టర్: అర్జున్ కృష్ణ,
మీడియా, లైన్ ప్రొడ్యూసర్: విజయ్ మట్టపల్లి,
నిర్మాతలు: వర్ధన్ దేవరకొండ, విజయ్ దేవరకొండ,
రచన, దర్శకత్వం: షమ్మీర్ సుల్తాన్


Click it and Unblock the Notifications











