మేటి దర్శకురాలు.. గిన్నిస్ రికార్డు ఘనత.. విజయ నిర్మల మృతికి వైఎస్ జగన్ సంతాపం

ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల ఇకలేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడతున్న ఆమె బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ విజయ నిర్మల మరణించారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. విజయ నిర్మల మృతి వార్త సినీ వర్గాలు, అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. విజయ నిర్మల కుటుంబానికి పలువురు సినీ, వ్యాపార, ఇతర పరిశ్రమల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సంతాపాన్ని ప్రకటించారు. ఆయన తన సంతాప ప్రకటనలో ఏమన్నారంటే..

అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల మృతిపట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సినీ రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకొన్నారు.విజయనిర్మల కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుపుతూ..

Vijaya Niramala death: AP CM YS Jagan condolences

అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన మేటి దర్శకురాలైన విజయనిర్మల మరణం చిత్రపరిశ్రమకు తీవ్ర లోటు అని అన్నారు.

కాగా, విజయ నిర్మల భౌతికకాయాన్ని గురువారం (జూన్ 27న) ఉదయం 11 గంటలకు నానక్‌రామ్‌గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకు వస్తారు. అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శనార్థం అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం ఫిలిం ఛాంబర్‌కు తీసుకువచ్చి ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తారు. శుక్రవారం మధ్యాహ్నం గానీ, సాయంత్రంగానీ ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు అని సినీ వర్గాలు పేర్కొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X