విజయ నిర్మల అంతిమ యాత్ర.. అంత్యక్రియలు ఎప్పుడు.. ఎక్కడంటే?
తెలుగు సినిమా పరిశ్రమకు దిశానిర్దేశం చేసిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఒకరైన విజయనిర్మల ఆకస్మిక మరణం తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆమె మరణాన్ని సినీలోకం జీర్ణించుకోలేకపోతున్నది. విజయ నిర్మలతో తమకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె కుమారుడు, నటుడు వీకే నరేష్ తన తల్లి మరణ వార్తను అధికారికంగా వెల్లడించారు.
నా తల్లి విజయ నిర్మల గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లారని తెలియ జేయడానికి చింతిస్తున్నాను. ప్రముఖ నటి, నిర్మాత, దర్శకురాలు డాక్టర్ జీ విజయ నిర్మల గారు జూన్ 27 తేదీ తెల్లవారు జామున హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో మరణించారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె వయసు 75 సంవత్సరాలు అని వీకే నరేష్ తన తల్లి మరణం గురించి ట్వీట్ చేశారు.

కాగా, విజయ నిర్మల గారి అంతిమ యాత్ర శుక్రవారం ఉదయం 8 గంటలకు నానక్‌రామ్ గుడాలోని ఆమె స్వగృహం నుంచి ప్రారంభమవుతుంది. చిలుకూరులోని తన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరుగుతాయి అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











