Just In
Don't Miss!
- Lifestyle
Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- News
ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల కోసం .. మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్
- Automobiles
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- Sports
హైదరాబాద్ చేరుకోగానే.. తండ్రి సమాధి దగ్గరకు వెళ్లిన సిరాజ్!!
- Finance
ఏడాదిలో అదరగొట్టిన ఎనిమిది స్టాక్స్.. ఎంత జంప్ చేశాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమవుతున్న మరో వారసుడు
పద్మ భూషణ్, దిగ్గజ నటుడు సూపర్ స్టార్ కృష్ణ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ విజయ నిర్మల మనవడు శరణ్ 'ది లైట్' కుమార్ హీరోగా అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సినెటెరియా మీడియా వర్క్స్ (ప్రొడక్షన్ నెంబర్ 3) నిర్మిస్తోంది. రామచంద్ర వట్టికుట్టి దర్శకత్వం వహిస్తుండగా లియో విలియం, డేవిడ్ కలిసి సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..జనవరి మరియు ఫిబ్రవరిలో మా చిత్రం హైదరాబాద్, బెంగళూరు, మంగళూరు మరియు చెన్నైలలో చిత్రీకరించబడుతుందని అన్నారు
ఇక దర్శకుడు రామచంద్ర వట్టికుట్టి మాట్లాడుతూ, "ఇది రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్. శరణ్ అరంగేట్రం చేసినప్పటికీ అనుభవజ్ఞుడైన నటుడిలా నటిస్తున్నాడు. అతనికి జోడిగా ఒక బాలీవుడ్ నటిని కథానాయికగా ఎంచుకున్నాము. ఆమె పేరు త్వరలో ప్రకటించబడుతుందని అన్నారు.

ఇక 'జెమిని' సురేష్, 'జబర్దాస్త్' త్రినాథ్, సురేందర్ రెడ్డి, సాహితి భరద్వాజ్, వెంకట్ రమణ, సతీష్ దాసరం, డాక్టర్ జె.బి.ప్రసాద్, రాహుల్ రంజాన్ షా, కిరణ్ ఎం, ప్రవాలికా, శ్రీమణి, గోపాల్, హర్ష, వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. ఇక మిగతా టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. ఎడిటింగ్: లోకేష్ కుమార్ కదాలి, సంభాషణలు: డాక్టర్ చల్లా భాగ్య లక్ష్మి, పాటలు: సురేష్ గంగూలా, నృత్యాలు: సత్య, సినిమాటోగ్రఫీ: భరద్వాజ్, సంగీతం: రఘు రామ్, అసోసియేట్ ప్రొడ్యూసర్ లియో విలియం, సమర్పకులు: మన్విత మరియు కుషల కుమార్ బులేమాని, నిర్మాతలు: శ్రీలత బి వెంకట్ మరియు వెంకట్ బులేమాని, దర్శకుడు: రామచంద్ర వట్టికుట్టి