విజయ నిర్మల నా మెంటర్, ఆమె వల్లే తెలుగు ఇండస్ట్రీకి: విజయశాంతి ఎమోషనల్

ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల మరణం తెలుగు సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టివేసింది. విజయ నిర్మల పార్థివ దేహాన్ని గురువారం అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం నానక్‌రాంగూడలోని నివాసంలో ఉంచారు. శుక్రవారం చిలుకూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

విజయ నిర్మల పార్థివ దేహాన్ని సందర్శించిన అనంతరం ప్రముఖ నటి విజయ శాంతి ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమె నాకు మెంటర్. నిర్మలమైన స్వభావంతో ఎన్నో విజయాలు సాధించిన విజయ నిర్మలమ్మగారు తరతరాలు తెలుగు చలనచిత్ర చరిత్రలో నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... మీరు సినిమాకు పరిచయం చేసిన మీ విజయశాంతి.'' అంటూ ట్వీట్ చేశారు.

Vijayashanthi emotional tweet about Vijaya Nirmala

1980లో విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన 'కిలాడి కృష్ణుడు' సినిమా ద్వారా విజయశాంతి తెలుగులో హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టారు. ఈ చిత్రంలో కృష్ణ హీరోగా నటించగా విజయశాంతి హీరోయిన్. ఈ మూవీ తర్వాత ఆమె తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకున్నారు.

విజయ నిర్మల వయసు 73 సంవత్సరాలు. 7వ ఏటనే బాలనటిగా కెరీర్ మొదలు పెట్టిన ఆమె హీరోయిన్‌గా చాలా చిత్రాల్లో నటించారు. దర్శకత్వంలోనూ తన ప్రతిభ చాటారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించి అత్యధిక చిత్రాలు డైరెక్ట్ చేసిన దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుని మహిళలకు ఆదర్శంగా నిలిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X