రాజసం ఉట్టిపడేలా.. అదరగొట్టిన విజయశాంతి

Recommended Video

Vijayashanthi First Look From Sarileru Neekevvaru || నేడు సాయంత్రం మహేష్ పోస్టర్

లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి వెండితెరపై కనబడక దాదాపు పద్నాలుగేళ్లు అవుతోంది. చివరగా నాయుడమ్మ చిత్రంలో కనిపించి ఫ్యాన్స్‌ను అలరించింది. మళ్లీ ఇన్నేళ్లకు మేకప్ వేసుకుని స్క్రీన్‌పై విజృంభించేందుకు రెడీ అయింది.

సరిలేరు నీకెవ్వరులో పవర్‌ఫుల్ పాత్రలో..

సరిలేరు నీకెవ్వరులో పవర్‌ఫుల్ పాత్రలో..

ఎఫ్2 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి చెప్పిన కథ బాగా నచ్చడం, తన పాత్రకు ప్రాముఖ్యత ఉండటంతో సినిమాను ఓకే చేసింది. ఇప్పటికే విజయశాంతిపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్టు సమాచారం.

ఇప్పటికే పోస్టర్స్‌తో హంగామా..

ఇప్పటికే పోస్టర్స్‌తో హంగామా..

ఇంతవరకు మహేష్ బాబుకు సంబంధించిన పోసర్ట్స్‌తో హంగామాచేసింది చిత్రబృందం. సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్, దసరా కానుకగా విడుదల చేసిన కొండారెడ్డి బురుజు సెంటర్ వద్ద మహేష్ పోస్టర్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.

దీపావళి కానుకగా..

దీపావళి కానుకగా నేడు లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. పోస్టర్ చూస్తుంటేనే విజయశాంతి పాత్ర ఏవిధంగా ఉండబోతోందో అర్థమవుతోంది. భారతి పాత్రలో లేడీ అమితాబ్ అదరగొట్టబోతోందని అభిమానులు సంబరపడుతున్నారు. కొండా రెడ్డి బురుజు వద్ద విజయశాంతిని మహేష్ కాపాడే సీన్, యాక్షన్ సీన్స్ అదిరిపోనున్నాయని తెలుస్తోంది.

సాయంత్రం మహేష్ బాబు పోస్టర్..

సాయంత్రం మహేష్ బాబు పోస్టర్..

నేటి సాయంత్రం 5.04గంటలకు మహేష్ బాబు స్పెషల్ పోస్టర్ రిలీజ్ కానుంది. మరి ఈ పోస్టర్ సినిమాపై ఇంకెన్ని అంచనాలను పెంచేస్తుందో చూడాలి. రష్మీక మందాన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో బండ్ల గణేష్ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ జనవరి 12న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X