twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాలు చెయ్ రాములక్క.. కథ బాగుండాలి పాత్ర దద్దరిల్లాలి.. విజయశాంతి కామెంట్స్

    |

    సరిలేరు నీకెవ్వరు తెలుగు రాష్ట్రాల్లో వీర విహారం చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని నమోదు చేస్తోంది. ఈ చిత్రం విడుదలైన వారంలోపే వంద కోట్ల షేర్‌ను వసూళ్లు చేసి.. మహేష్ బాబు సత్తాను చాటాయి. అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్, మహేష్ బాబు ఎనర్జీ, దేవీ సంగీతం ఇలా అన్ని అంశాలు తోడై సరిలేరును బ్లాక్ బస్టర్‌ కా బాప్‌గా నిలబెట్టాయి. ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు గానూ ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ.. విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. హన్మకొండలో జరిగిన ఈ వేడుకలో విజయశాంతి మాట్లాడుతూ..

    ప్రజలందిస్తున్న ఓరుజల్లు..

    ప్రజలందిస్తున్న ఓరుజల్లు..

    లేడీ సూపర్‌స్టార్ మాట్లాడుతూ.. ‘మన ఓరుగల్లు..సరిలేరు సినిమాకి ప్రజలు నీరాజనం అందిస్తున్న ఓరుజల్లు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. 'సరిలేరు నీకెవ్వరు'సినిమాని బ్లాక్ బస్టర్ కా బాప్‌గా నిలిపిన మీఅందరికి నా శిరసువంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 13 ఏళ్లకు ముందు మీ రాములమ్మ, మీ బిడ్డని ఏ రకంగా ఆదరించారో.. ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్లారో.. నేను ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో తెలియడం లేదు.

     కథ నచ్చింది.. చేశా.. హిట్ కొట్టాం..

    కథ నచ్చింది.. చేశా.. హిట్ కొట్టాం..

    13 ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు అనే మంచి సినిమా నాదగ్గరికి రావడానికి ముఖ్య కారణం అనిల్ రావిపూడి. కథ విన్నాను నచ్చింది.. చేశా.. హిట్ కొట్టాం అని తెలియజేసుకుంటున్నాను. భారతి ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచి పోయింది. సైనికుల తల్లి తండ్రుల భాద ఏంటి అనేది అనిల్ చక్కగా, సందేశాత్మకంగా చూపించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో 'కొడుకు దిద్దన కాపురం' సినిమాలో కలిసి నటించాను అది సూపర్ హిట్. ఇప్పడు `సరిలేరు నీకెవ్వరు` లో కలిసి నటించాను ఇది సూపర్ డూపర్ హిట్.

    సినిమాలు చెయ్ రాములక్క..

    సినిమాలు చెయ్ రాములక్క..

    బాబు తో పని చేయడం చాలా కంఫర్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారు. ఇంకా సినిమాలు చేయి రాములక్క అని అందరూ అడుగుతున్నారు. మీ అందరికి తెలుసు సబ్జెక్ట్ బాగుండాలి..పాత్ర దద్దరిల్లాలి అలాగైతేనే ఈ రాములక్క చేస్తుంది. ఎందుకంటే సినిమా ఒకటే కాదు రాజకీయం కూడా ఉంది. నేను ప్రజల మనిషిని ప్రజలకోసమే పనిచేస్తాను. మీరెప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా'ని అన్నారు.

    English summary
    Vijayashanthi Speech AT Block Buster Ka Baap Celebrations
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X