Leo Story Leak.. విజయ్, లోకేష్ కాంబినేషన్‌లో పవర్‌ఫుల్‌గా లియో.. కథ ఏమిటంటే?

తమిళ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం లియో. ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబడుతున్నది. ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి నిర్మించారు. దసరా పండుగ కానుకగా రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతున్న లియో సినిమా కథ సోషల్ మీడియాలో లీక్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథ ఏమిటంటే?

లియో సినిమాలో సూపర్ స్టార్ విజయ్ ముంబైలో గ్యాంగ్‌స్టర్‌. తనకంటూ ఓ మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు. జీవించడానికి అవసరమైన డబ్బు కోసం గ్యాంగ్ స్టర్‌గా మారిన లియోకు ఎదురైన సంఘటనలు ఏమిటి? మాఫియా సామ్రాజ్యంలో లియో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే లియో సినిమా కథ.

Vijays Leo

లియో చిత్రం పూర్తిస్థాయి యాక్షన్, డ్రామా, ఎమోషన్స్‌తో లోకేష్ కనకరాజ్ రూపొందించారు. విక్రమ్ సినిమా తర్వాత పెరిగిన క్రేజ్ తగినట్టుగా ఈ సినిమాను టాప్ క్లాస్‌ మేకింగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ సినిమా నిడివిని 2.30 గంటలుగా ఫిక్స్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

లియో సినిమా రిలీజ్‌కు ఇంకా 30 రోజులకుపైగానే ఉంది. ఈ సినిమాపై ఉన్న క్రేజ్, డిమాండ్ కారణంగా ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. యూకేలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ రెస్పాన్స్ లభిస్తున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ యూకేలో 96 ప్రదేశాల్లో ప్రారంభించారు.

Vijays Leo

తాజా సమాచారం ప్రకారం.. లియో సినిమాకు సంబంధించిన 206 షోలకు అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఇప్పటి వరకు దాదాపు 13 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. తెలుగు వెర్షన్‌ టికెట్లు 1300, తమిళ వెర్షన్ టికెట్లు 11500 వేలు, హిందీ 200 టికెట్లు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X