అక్కినేని హీరోతో హారర్ మూవీ.. మనం దర్శకుడి మరో కొత్త ప్రయోగం
అక్కినేని యువ హీరో నాగ చైతన్య మంచి స్పీడ్ మీద సినిమాలను ఒకే చేస్తున్నాడు. సమంతతో చేసిన మజిలీ సినిమా అనంతరం ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. నాగ చైతన్య రానున్న రోజుల్లో మరిన్ని డిఫరెంట్ సినిమాలతో రాబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాల విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట. ఇక సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లలో నటించడానికి కూడా రెడీ అయ్యాడు.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. నాగ చైతన్య ఇటీవల చాలా మంది దర్శకులతో కొత్త కాన్సెప్ట్ ల గురించి చర్చించారట. దాదాపు ముగ్గురు దర్శకులు చెప్పిన కాన్సెప్ట్ లపై చైతు పాజిటివ్ గా స్పందించాడట. వాటిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మనం దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో ఇప్పటికే థాంక్యు అనే సినిమాను సెట్స్ పైకి తెచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఇటీవల ఆ దర్శకుడు చెప్పిన మరో వెబ్ కంటెంట్ ఐడియా కూడా అక్కినేని హీరోకు బాగా నచ్చేసిందట.

అమెజాన్ ప్రైమ్ ఆధ్వర్యంలో ఆ వెబ్ సిరీస్ హారర్ ప్లస్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కనుందట. ఈ కాన్సెప్ట్ చైతుకి ఎంతవరకు సెట్టవుతుందో తెలియదు గాని దర్శకుడు మాత్రం చాలా కాలంగా ఆ కథకు తెరకెక్కించాలని అనుకుంటున్నాడు. 2009లో వచ్చిన 13B సినిమాతో విక్రమ్ కుమార్ మంచి థ్రిల్లింగ్ హిట్ కొట్టడు. మళ్ళీ ఆ తరువాత హారర్ జానర్ ను టచ్ చేయలేదు. చివరగా గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన విక్రమ్ అనుకున్నంతగా సక్సెస్ సాదించలేకపోయాడు. దీంతో నెక్స్ట్ అక్కినేని హీరోతోనే బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్టులతో హిట్ కొట్టడానికి సిద్ధమవుతున్నాడు.


Click it and Unblock the Notifications











