ప్రభాస్, లోకేష్ కనగరాజ్.. థియేటర్లు బద్దలయ్యే న్యూస్.. డిటేయిల్స్!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఎంత పెద్ద ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారో తెలిసిందే. బిగ్ స్కేల్లో డార్లింగ్ సినిమాలు రూపుదిద్దుకుంటుండటం విశేషం. 'బాహుబలి' సిరీస్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలకు వరల్డ్ మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉందో తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ చేతిలో రూ.4 వేల కోట్ల ప్రాజెక్ట్స్ ఉండటం ఆసక్తికరంగా మారింది. డార్లింగ్ కటౌట్ కు, యాక్షన్ కు బాక్సాఫీస్ రికార్డులు చెరిగిపోతున్నాయి. చివరిగా 'సలార్', 'కల్కి 2898 ఏడీ' చిత్రాలతో వేల కోట్ల వసూళ్లు రాబట్టాడు.

కాగా ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో ఉన్న చిత్రాలతో పాటు మరిన్ని లైనప్ లో చేరుతుండటంతో ఇండస్ట్రీలో ప్రభాస్ సినిమాలపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే డార్లింగ్ క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తుండగా.. తాజాగా మరో ప్రాజెక్ట్ ను కన్ఫమ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. డైరెక్టర్ మారుతీ, హను రాఘవపూడి, సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ వంటి సెన్సేషనల్ డైరెక్ట్స్ తో భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ వచ్చింది.

Vikram Movie Director Lokesh Kanagaraj confirmed crazy Project with Prabhas Here is Interesting Details

తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నుంచి ఎలాంటి చిత్రాలు వచ్చాయో తెలిసిందే. ఆయన డైరెక్షన్, స్క్రీన్ ప్లేకు ఇండియా షేక్ అయ్యింది. కార్తీ 'ఖైదీ', కమల్ హాసన్ తో 'విక్రమ్', విజయ్ దళపతితో 'లియో' వంటి చిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రాలతో లోకేష్ కనగరాజ్ ఒక సినిమాటిక్ యూనివర్స్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. లోకీ యూనివర్స్ కు ఇండియాలో మంచి డిమాండ్ ఉండింది. చివరిగా వచ్చిన 'విక్రమ్'లో సూర్య 3 నిమిషాల క్యామియో రోల్ తో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే.

కాగా 'లియో' కాస్తా ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందనను పొందింది. దీంతో ఇప్పుడు లోకేష్ కనగరాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా డైనోసార్ డార్లింగ్ ప్రభాస్ ను లోకీ యూనివర్స్ లోకి తీసుకొస్తున్నారు. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో నెక్ట్స్ ప్రభాస్ ను తీసుకురాబోతున్నారని కన్ఫమ్ చేశారు. సూర్యను.. రోలెక్స్ గా చూపించిన తీరుతో ఇక ప్రభాస్ ను ఏ రేంజ్ లో లోకేష్ చూపించబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.

Vikram Movie Director Lokesh Kanagaraj confirmed crazy Project with Prabhas Here is Interesting Details

ప్రభాస్ తో తెరకెక్కించబోయే చిత్రం లోకేష్ కనగరాజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా ఉండబోతుందని ఆశించారు. అయితే ప్రభాస్ ఇప్పుడు 'రాజా సాబ్', 'ఫౌజీ', 'స్పిరిట్' వంటి చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అలాగే ప్రశాంత్ నీల్ తో 'సలార్2', నాగ్ అశ్విన్ తో 'కల్కి 2898 ఏడీ 2' సీక్వెల్స్ కూడా రూపుదిద్దుకోవాల్సి ఉంది. ఈ సందర్భంగా ప్రభాస్ తో లోకేష్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభం కాబోతుందనేది హాట్ టాపిక్ గ్గా మారింది. ఈ ప్రాజెక్ట్ తో థియేటర్లు బద్దలవడంతో పాటు ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు. దీనిపై మున్ముందు మరిన్ని క్రేజీ అప్డేట్స్ రానున్నాయి.

More from Filmibeat

Read more about: lokesh kanagaraj prabhas fauji
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X