Don't Miss!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్‌కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్‌లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Travel గుడ్‌ప్రైడే రోజున లాంగ్‌వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్‌లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
విక్రమ్ విశ్వరూపం.. హరి దుమ్ము దులిపేశారు.. సామి2 గురించి..
భారీ కమర్షియల్ హంగులతో సెప్టెంబర్ 21న రాబోతోన్న 'సామి'పుష్యమి ఫిలిం మేకర్స్, ఎమ్.జి. ఔరా సినిమాస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్లలో బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ నిర్మాతలుగా సెన్సేషనల్ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం 'సామి'. 'సింగం, సింగం 2 , సింగం 3 , పూజా' వంటి సూపర్ హిట్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేయించుకున్న హరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.
విక్రమ్, హరి కాంబినేషన్లో 15 సంవత్సరాల క్రితం వచ్చిన 'సామి' చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే.ఇప్పుడదే టైటిల్‌తో తెలుగులో రాబోతోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ మాట్లాడుతూ... ''ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ట్రైలర్ తోనే హరి గారు దుమ్ము దులిపేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. విక్రమ్‌గారి నట విశ్వరూపం ఇందులో చూస్తారు అని అన్నారు.
దర్శకుడు హరి గురించి, ఆయన తీసే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తక్కువగా మాట్లాడతారు. మొత్తం ఆయన సినిమాలే చూసుకుంటాయి. దేవి శ్రీ ప్రసాద్ గారి సంగీతం ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్రాన్ని సెప్టెంబర్ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము..'' అని కావ్య వేణుగోపాల్ అన్నారు.