19 ఏళ్ల తర్వాత అపరిచితుడు రీరిలీజ్ .. క్రేజీ థ్రిల్లర్ ఎప్పుడు రీరిలీజ్ కాబోతుందంటే?
ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన క్రేజీ మూవీ అపరిచితుడు గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధ్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చి అందరి గుండెలను తాకిన ఈ క్రేజీ మూవీకి థియేటర్లలోకి వచ్చి 19 ఏళ్ల అవుతుంది. విక్రమ్, సదా హీరోహీరోయిన్లుగా చేసిన ఈ మూవీలో.. విక్రమ్.. రాము, రెమె, అపరిచితుడుగా కనిపిస్తూ.. అందరినీ థ్రిల్ చేశాడు. అయితే తాజాగా ఈ క్రేజీ మూవీని రీరిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఎప్పుడు థియేటర్లో సందడి చేయబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
"అన్నియన్" అనే తమిళ సినిమా నుంచి తెలుగులోకి డబ్ చేశారీ అపరిచితుడు చిత్రాన్ని. ఎస్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ క్రేజీ మూవీ ఆస్కార్ ఫిలిమ్స్ బ్యానర్ పై వి రవిచంద్రన్ నిర్మించారు. శంకర్ తో పాటు సుజాత రంగరాజన్ లు రాసిన ఈ కథను శంకర్ తమిళ్ లో తెరకెక్కించగా.. తెలుగులో నరేష్ కుమ్మరికుంట్ల తెరకెక్కించారు. అలాగే రవివర్మన్ తో పాటు మణికందన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన ఈ సినిమాకు హ్యారీస్ జయరాజ్ సంగీతం అందించారు.

2005 జూన్ 17వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన అపరిచితుడు సినిమా.. ఎవరూ ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా తెలుగు, తమిళ ప్రజలంతా.. రెమో, రాము, అపరిచితులను మర్చిపోవడానికి చాలా సమయమే తీసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు అయితే నెక్స్ట్ లెవెల్ యే. ఇంత అద్భుతమైన చిత్రం దాదాపు 19 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి రాబోతుంది. మే 17వ తేదీ నుంచి ఈ క్రేజీ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.
థియేటర్లలో ఈ సినిమాను ఎక్స్ పీరియన్స్ చేయని ప్రతీ ఒక్కరూ థియేటర్ లో ఈ సినిమా చూడాల్సింద్. అస్సలే మిస్ కావొద్దు. అద్భుతంగా ఉండే ఈ క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో విక్రమ్ నటన నెక్స్ట్ లెవెల్ అంతే. సో ఈ బ్యూటీఫుల్ మూవీని ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లవర్స్ తో కలిసి చూసేసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. మే 17వ తేదీని అస్సలే మర్చిపోకండి.


Click it and Unblock the Notifications











