Vikram Telugu Trailer: వేట మామూలుగా లేదు.. కమల్ హాసన్ కు ధీటైన పాత్రలో విజయ్, ఫాహాద్!

విశ్వనటుడు కమల్ హాసన్ చాలా రోజుల తర్వాత మరొక ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల అవుతోంది. టాలీవుడ్ యువ హీరో నితిన్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాడు. దాదాపు 9 కోట్ల వరకు బిజినెస్ కూడా చేసినట్లుగా తెలుస్తోంది.

రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమా ట్రైలర్ తోనే ఒక్కసారిగా అంచనాలు స్థాయిని మరింత పెంచేశారు. కమల్ హాసన్ తో పాటు మరో ఇద్దరు అగ్రనటులు ఇందులో ముఖ్యమైన పాత్రలో కనిపించడం విశేషం. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఫాహద్ ఫాజిల్ నటించగా మరొక ముఖ్యమైన డాన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించాడు.

Vikram Telugu movie Trailer talk stars powerful characters

ఇక పవర్ఫుల్ హీరో గా కమల్ హాసన్ నటించాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే ఈ సినిమా అద్భుతంగా ఉండబోతోంది అని అర్థమవుతుంది. 'ఒక అడవిలో పులి చిరుత సింహం వేటకు వెళ్ళినప్పుడు జింకను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆలోపు సూర్యోదయం అయితే సూర్యోదయాన్ని ఎవరు చూస్తారు అనేది ప్రకృతి నిర్ణయిస్తుంది. కానీ ఈ అడవిలో వెలుతురు ఎప్పుడు ఎక్కడ రావాలి అని నిర్ణయించేది నేను అంటూ కమల్ హాసన్ చెప్పిన డైలాగ్ అద్భుతంగా ఉంది.

ఇక ఫాహాద్ ఫాజిల్ పట్టు విడువని పోలీస్ ఆఫీసర్ గా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటున్నాడు. ఇక మరోవైపు విజయ్ సేతుపతి కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో చాలా మొండిగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరిద్దరి కంటే దీటుగా కమలాసన్ కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంటున్నాడు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుంది అని అనిపిస్తోంది. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ అయితే ఉంది. మరి ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X