For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పుష్ప రాజ్‌ను ఢీకొట్టే భన్వర్ సింగ్ వచ్చేశాడు: ఊహించని లుక్‌తో భయపెట్టిన స్టార్

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య పాన్ ఇండియా రేంజ్ సినిమాల హవా కనిపిస్తోంది. అన్ని ప్రాంతాల్లోనూ మన చిత్రాలకు ఆదరణ భారీ స్థాయిలో లభిస్తోంది. ఫలితంగా ఇప్పటికే పలు పాన్ ఇండియా రేంజ్ మూవీలు ప్రేక్షకుల ముందుకు రాగా.. మరికొన్ని షూటింగ్‌ను దశలో ఉన్నాయి. అలాంటి వాటిలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వస్తున్న 'పుష్ప.. ద రైజ్' ఒకటి. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రాబోతున్న దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

  ఆరియానాపై అవినాష్ సంచలన వ్యాఖ్యలు: అతడితో అలాంటి పనులు.. తప్పని చెప్పినా వినలేదంటూ!

  ఐదు భాషల్లో అత్యున్నత విలువలతో రాబోతున్న 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన 90 శాతం షూటింగ్ పూర్తైంది. అలాగే, రెండో పార్ట్‌ కోసం దాదాపు 30 శాతం చిత్రీకరణ జరిపారు. ఇప్పుడు మొదటి దాని కోసం షూట్ చేస్తున్నారు. ఇక, మొదటి భాగాన్ని 'పుష్ప.. ద రైజ్' పేరిట వచ్చే క్రిస్టమస్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. దీంతో ఈ సినిమా కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు.

  Tollywood Star Hero Allu Arjun Doing Pushpa Under Creative Director Sukumar Direction. Now This Movie Fahadh Faasil First Look Poster Released.

  భారీ అంచనాల నడుమ రూపొందుతోన్న 'పుష్ప' మూవీ నుంచి వరుసగా అప్‌డేట్ల మీద అప్‌డేట్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి పలు పోస్టర్లు, టీజర్, పాట కూడా విడుదల అయ్యాయి. వాటన్నింటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో అల్లు అర్జున్ ఖాతాలో ఎన్నో రికార్డులు వచ్చి చేరాయి. అదే సమయంలో అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీలో విలన్ పాత్రను చేస్తోన్న ఫహాద్ ఫాజిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ముందు చెప్పిన దాని ప్రకారం దీన్ని ఈరోజు ఉదయం 10.08 గంటలకు వదిలారు.

  ఘాటు ఫోజులతో రెచ్చిపోయిన సుస్మితా సేన్: 45 ఏళ్ల వయసులో మరీ ఇంత దారుణంగానా!

  తాజాగా విడుదలైన పోస్టర్‌లో ఫహాద్ ఫాజిల్ ఊహించని విధంగా గుండుతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక, ఈ చిత్రంలో అతడు ఐపీఎస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ శెఖావత్‌గా నటిస్తున్నాడు. గంథపు చెక్కల స్మగ్లర్ అయిన పుష్పరాజ్‌తో అతడు ఢీకొట్టబోతున్నాడు. ఈ పోస్టర్ చూసిన తర్వాత వీళ్లిద్దరి మధ్య పోరు భీకరంగా ఉండేలా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఫహాద్ ఫాజిల్ మలయాళ పరిశ్రమకు చెందిన స్టార్ హీరో. అతడు అసాధారణమైన నటనతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. అందుకే దక్షిణాది మొత్తం హవాను చూపిస్తూ దూసుకెళ్తున్నాడు.

  అల్లు అర్జున్.. సుకుమార్ కలయికలో రాబోతున్న 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు ఎన్నో సాహసలు చేస్తున్నాడు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇందులో కీలక పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే.

  English summary
  Tollywood Star Hero Allu Arjun Doing Pushpa Under Creative Director Sukumar Direction. Now This Movie Fahadh Faasil First Look Poster Released.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X