Villain of Pushpa: పుష్ప రాజ్‌ను ఎదుర్కోబోయే భయంకర విలన్ అతనే.. నేషనల్ అవార్డ్ విన్నర్

టాలీవుడ్ నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమాల్లో పుష్ప కూడా ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. స్టైలిష్ స్టార్ కెరీర్ లో అత్యదిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కూడా ఇదే. ఇక సినిమాలో విలన్ పాత్రపై ఫైనల్ గా ఒక క్లారిటీ ఇచ్చేశారు.

మాళవిక మోహనన్ బ్యూటీఫుల్ గ్యాలరీ.. మీరెప్పుడూ చూడని గ్లామర్ ఫోటోలు

నార్త్ లో కూడా భారీ అంచనాలు

నార్త్ లో కూడా భారీ అంచనాలు

అల్లు అర్జున్ కు నార్త్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతని డబ్బింగ్ సినిమాలు యూ ట్యూబ్ లో ఇప్పటికే వందల మిలియన్ల వ్యూవ్స్ అందుకున్నాయి. దీంతో అందరి చూపు ఇప్పుడు పుష్పపై పడింది. ఈ సినిమా తప్పకుండా ఊహాలకందని రేంజ్ లో ఉంటుందని చెప్పవచ్చు.

పర్ఫెక్ట్ వయ్యారాలతో కనువిందు చేస్తున్న శివాని నారాయణన్

విలన్స్ పై రూమర్స్

విలన్స్ పై రూమర్స్

దర్శకుడు సుకుమార్ మొదటిసారి చేస్తున్న ఈ ఫుల్ యాక్షన్ డ్రామాలో నటించే విలన్ ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. మొదట విజయ్ సేతుపతిని అనుకున్న విషయం తెలిసిందే. అయితే డేట్స్ కుదరకపోవడంతో సేతుపతి తప్పుకున్నట్లు మరో టాక్ వచ్చింది. ఆ తరువాత బాలీవుడ్, కోలీవుడ్ లోని కొంతమంది ప్రముఖ నటులు పేర్లు కూడా వినిపించాయి.

విలన్ గా నేషనల్ అవార్డ్ విన్నర్

ఫైనల్ గా సినిమాకి విలన్ ఫహద్ ఫాసిల్ ను సెలెక్ట్ చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మంచి నటుడిగా క్రేజ్ అందుకున్న ఈ నటుడు 40 కి పైగా చిత్రాలలో నటించాడు. జాతీయ చలనచిత్ర పురస్కారం, నాలుగు కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు కూడా అందుకున్నాడు.

విశ్వరూపాన్ని చూపిస్తాడట

విశ్వరూపాన్ని చూపిస్తాడట

అసలే బన్నీకి మలయాళం ఇండస్ట్రీలో మల్లు స్టార్ అని ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. ఇక మొత్తానికి విలన్ ను ఆ ఇండస్ట్రీలో నుంచే తేవడంతో ఇప్పుడు అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఫహద్ ఫాసిల్ మంచి టైమింగ్ ఉన్న నటుడిగా క్రేజ్ అందుకున్నాడు కాబట్టి సినిమాలో అతను విశ్వరూపాన్ని చూపించగలడని చిత్ర యూనిట్ నమ్ముతోంది. ఇక సినిమాను ఆగస్టు 13న పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X