అలా చేశానని మహేష్ ఫ్యాన్స్ కొట్టబోయారు.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన విలన్!

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినీ రంగంలోకి ప్రవేశించిన మహేష్ బాబు ఇప్పుడు సూపర్ స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు.. అందాల రాకుమారుడిగా ఎంతో మంది అమ్మాయిలు ఆయనను ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఆయన అభిమానులు తమ హీరోని కొట్టాడని చెబుతూ సినిమాలో విలన్ పాత్ర వేసే ఒక వ్యక్తిని కొట్టడానికి వెళ్లారట. ఆసక్తికరంగా ఉన్న ఆ వివరాల్లోకి వెళితే.

సూపర్ స్టార్ క్రేజ్

సూపర్ స్టార్ క్రేజ్

రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ సాధించి సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. ఆయన సినిమా చేస్తున్నారు అనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటాయి. ఎక్కువగా క్లాస్ సినిమాలు చేస్తూ ఉండే ఆయన అన్ని తరగతుల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అని చెప్పాలి.

అది కామన్ అయినా

అది కామన్ అయినా

అయితే సినిమాల్లో హీరోలు, విలన్స్ తో గొడవ పడుతూ ఉండడం చాలా కామన్. ఒక్కోసారి హీరో విలన్స్ ని చితక్కొడితే ఒక్కో సారి మాత్రం విలన్స్ చేతిలో దెబ్బలు తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే తమ అభిమాన హీరో విలన్స్ ని చితక్కొడుతుంటే ఎంజాయ్ చేసే ఫ్యాన్స్ తమ హీరో దెబ్బలు తింటే మాత్రం బాధ పడిపోతారు.

క్రేజీ ఫాన్స్

క్రేజీ ఫాన్స్

అదంతా సినిమాలో ఒక భాగమే అయినా సరే తమ అభిమాన హీరో దెబ్బలు తిన్నారని భావించే అభిమానులకు ఇంకేమీ గుర్తుండవు.. అలా మహేష్ బాబుని నిజం సినిమాలో ఒక చోట కాలితో తోక్కాల్సి వస్తుంది. ఈ సినిమాలో విలన్ గా గోపీచంద్ నటించగా గోపీచంద్ గ్యాంగ్లో వ్యక్తిగా ఉజ్జయినీ శంకర్ అనే విలన్ నటించాడు. మహేష్ బాబుని గాయపరచి పడేసిన తర్వాత మహేష్ బాబు మీద శాడిజం చూపిస్తాడు గోపీచంద్.

మా హీరో కాలే తొక్కుతావా అంటూ

మా హీరో కాలే తొక్కుతావా అంటూ

ఆ సమయంలోనే శంకర్ మహేష్ బాబు కాలు మీద కాలు వేసి తొక్కి రక్తం కళ్ల చూస్తాడు. అయితే ఇదంతా సినిమాలో భాగమే కానీ నిజం సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకు తాను సినిమా ధియేటర్ కి వెళితే మా హీరోని తొక్కుతావా అంటూ ఆయన అభిమానులు తన చుట్టుముట్టారని శంకర్ చెప్పుకొచ్చాడు.. కొంచెం ఉంటే కొట్టేవారని తానే మేనేజ్ చేసుకుని మహేష్ లాంటి వ్యక్తిని నేను తొక్కే వాడినా అదంతా ఉట్టిదే అని కవర్ చేసుకున్నాం అని చెప్పుకొచ్చాడు.

నిజం రిలీజ్ సమయంలో

నిజం రిలీజ్ సమయంలో

ఇక ఉజ్జయినీ శంకర్ నిజం సినిమాలోనే కాక దాదాపు చాలా సినిమాల్లో కనిపించారు. ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకున్నారు కాని ఒకప్పుడు దాదాపుగా అన్ని సినిమాల్లో ఆయన కనిపిస్తూ ఉండేవారు.. మొత్తం మీద మహేష్ అభిమానులు తమ అభిమాన హీరో దెబ్బలు తినడం ఇష్ట పడక ఇలా విలన్ పాత్రధారి మీదకి దాడికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అయితే ఇదంతా ఇప్పటి సంగతి కాదండోయ్ 2004లో నిజం సినిమా రిలీజ్ అయినప్పుడు సంగతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X