వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ లైవ్: వేదిక వద్దకు కేటీఆర్, త్రివిక్రమ్.. ప్రత్యేక అతిథిగా
రంగస్థలం సెన్సేషనల్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన చిత్రం వినయ విధేయ రామ. ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ బోయపాటి శ్రీను. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 28న రిలీజ్ కానున్నది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు చలపతి రావు, సీనియర్ హీరోయిన్ స్నేహ, క్యారెక్టర్ ఆర్టిస్టులు హేమ, ప్రవీణ, తదితరులు హాజరయ్యారు.
వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ లైవ్ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. త్రివిక్రమ్‌తోపాటు రాంచరణ్, దర్శకుడు బోయపాటి శ్రీను వెంట వచ్చారు. ఆ తర్వాత భరత్ అనే నేను ఫేం కియారా అద్వాని కూడా వచ్చారు. వీరి రాకతో వేదిక వద్ద అభిమానుల అలజడి చెలరేగింది. భారీగా ఫ్యాన్స్ రావడంతో ప్రాంగణమంతా హడావిడిగా కనిపించింది.



Click it and Unblock the Notifications











