రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ ప్రి రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్‌, మాస్ చిత్రాల డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతున్న విన‌య విధేయ రామ‌ సంక్రాంతికి విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగం పెంచారు. డి.పార్వ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత దాన‌య్య డి.వి.వి ఈ చిత్రం రిలీజ్ డేట్ ఖారైంది.

సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... జనవరి 4న యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు జూ ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలో ఈ వేడుకకు సంబంధించి అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది.

విన‌య‌విధేయ రామ టాకీ షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. అయితే రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉండటంతో ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు పూర్తి చేసే పనిలో ఫిల్మ్ యూనిట్ బిజీగా గడుపుతోంది. ఈ నెల 26తో సాంగ్స్ షూటింగ్ పూర్తి కానుంది.

Vinaya Vidheya Rama’s pre-release event gets a date

చిత్రీకరణ జరుపుకుంటున్న రెండు పాటల్లో... ఒక స్పెష‌ల్ సాంగ్‌ను కూడా ఉంది. ఈ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రామ్‌చ‌ర‌ణ్‌, కియ‌రా అద్వాని జంట‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్‌, ప్ర‌శాంత్‌, ఆర్య‌న్‌రాజేష్ ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి మాట‌లు: య‌ం.ర‌త్నం, సినిమాటోగ్ర‌ఫీ: రిషి పంజాబి, ఆర్థ‌ర్ ఎ.విల్స‌న్‌, ఎడిటింగ్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌, ఫైట్స్‌: క‌న‌ల్ క‌ణ్ణ‌న్‌, సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: వి.వై.ప్ర‌వీణ్‌కుమార్‌, కో ప్రొడ్యూస‌ర్‌: డి.క‌ల్యాణ్‌, నిర్మాత‌: డి.వి.వి.దాన‌య్య‌, ద‌ర్శక‌త్వం: బోయ‌పాటి శ్రీను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X