‘వినయ విధేయ రామ’... స్పెషల్ షోలకు పర్మిషన్ గ్రాంటెడ్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వినయ విధేయ రామ. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 11న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
సంక్రాంతి సీజన్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో 'వినయ విధేయ రామ' చిత్రానికి అదనంగా స్పెషల్ షోలు ప్రదర్శించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. దీంతో జనవరి 11 నుంచి జనవరి 19 వరకు ఉదయం 5 గంటల నుంచి 11 గంటల మధ్య అదనంగా రెండు షోలు పడనున్నాయి. దీంతో రోజూ 4 ఆటలకు బదులు 6 ఆటలు ప్రదర్శింపబడనున్నాయి.

రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్ర పోషించారు. ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ, వివేక్ తదితరులు ప్రధాన తారాణంగా నటిస్తున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి మంచి స్పందన వచ్చింది. రామ్ చరణ్ కెరీర్లో ది బెగ్గెస్ట్ మాస్ మూవీగా ఈ చిత్రం ఉండబోతోందని అంటున్నారు. ఇందులో చెర్రీ ఒంటిపై టాటూలతో కండలు తిరిగిన శరీరంతో ఒళ్లు గగుర్బొడిచే యాక్షన్ సీన్లతో అలరించబోతున్నారు.


Click it and Unblock the Notifications











