‘వినయ విధేయ..’ ట్రైలర్: సరిగ్గా పుట్టినోడు, సరైన మగాడు ఒక్కడూ తగల్లేదంటున్న రామ్ చరణ్
Recommended Video

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ వినయ విధేయ రామ. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. బోయపాటి సినిమాలో యాక్షన్ సీన్లు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు వచ్చిన బోయపాటి అన్ని సినిమాలను మించిపోయేలా అదిరిపోయే యాక్షన్ ఈ చిత్రంలో ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది.

మేకింగ్ అదిరిపోయింది
మాస్ డైరెక్టర్ అనే పదానికి పూర్తి న్యాయం చేసే దర్శకుడు టాలీవుడ్లో ఎవరైనా ఉన్నారంటే... అది బోయపాటి మాత్రమే అనే ఒక బ్రాండ్ సొంతం చేసుకున్నారు. ట్రైలర్ చూస్తుంటే మరోసారి బోయాపాటి తన మేకింగ్ స్టైల్‌తో థియేటర్లను దడదడలాడించడం ఖాయంగా అనేలా ఉంది.

సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడూ మగాడేరా
‘‘సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడూ మగాడేరా... నాకు నీలా సైన్యం లేదు, ఒంట్లో బెరుకు లేదు. చావంటే అస్సలు భయం లేదు. బై బర్తే డెత్‌ను గెలిచొచ్చా'' అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్స్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయంటే రేపు థియేటర్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

వివేక్ ఒబెరాయ్ భయంకరమైన విలనిజం
ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు వివేక్ ఒబెరాయ్ చేసిన ది బెస్ట్ విలన్ పాత్ర ఇదే అనేలా బోయపాటి అతడిని ప్రజెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఓటైనా, మాటైనా, తూటా అయినా నాదే... అంటూ అతడు చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

టాటూ షాట్ సినిమాలో హైలెట్
ఒంటిపై టాటూలతో రామ్ చరణ్ మీద వచ్చే షాట్స్ సినిమాలో హైలెట్ అయ్యేలా ఉంది. ‘సరిగ్గా పుట్టినోడు, సరైన మగాడు ఒక్కడూ తగల్లేదు' అంటూ చెర్రీ చెప్పే డైలాగ్స్ సూపర్బ్ అనేలా ఉన్నాయి. రేపు థియేటర్లో వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
జవవరి 11 రిలీజ్
వినయవిధేయ రామ జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామ్‌చరణ్, కియరా అద్వాని జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, ఆర్యన్‌రాజేష్ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మాటలు: యం.రత్నం, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబి, ఆర్థర్ ఎ.విల్సన్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాశ్, ఫైట్స్: కనల్ కణ్ణన్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్‌కుమార్, కో ప్రొడ్యూసర్: డి.కల్యాణ్, నిర్మాత: డి.వి.వి.దానయ్య, దర్శకత్వం: బోయపాటి శ్రీను.


Click it and Unblock the Notifications











