‘వింటేజ్ కింగ్’గా ప్రభాస్: అబ్బో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా!

మామూలుగా ఏ స్టార్ హీరో అయినా ఒక్క సినిమా చేయడానికి కనీసం ఒక ఏడాది సమయం అయినా తీసుకుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ ఏకధాటిగా మూవీలు చేస్తూ దూసుకుపోతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. 'బాహుబలి' కోసం చాలా సమయం తీసుకున్న అతడు.. ఆ తర్వాత స్పీడు పెంచేసి మరీ ఎన్నో సినిమాలు అందించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'సలార్', 'ప్రాజెక్టు K', 'స్పిరిట్'తో పాటు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతితోనూ ఓ సినిమా చేస్తోన్నాడు.

అతి భారీ చిత్రాల్లోనే నటిస్తోన్న ప్రభాస్.. ప్రస్తుతం మారుతితో హర్రర్ కామెడీ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ కూడా ఎంతో సీక్రెట్‌గా సాగింది. ఇందుకోసం ఓ బూత్ బంగ్లా సెట్‌ను నిర్మించి, అందులో చిత్రీకరణ జరిపారు. ఇలా ఇప్పటికే దాదాపుగా 50 శాతానికి పైగా చిత్రీకరణ కంప్లీట్ చేశారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసుకునేలా చిత్ర యూనిట్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది.

Vintage King Title Fix for Prabhas and Maruthi Movie

హర్రర్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాకు 'రాజా డీలక్స్' అనే టైటిల్ పెట్టినట్లు ప్రచారం జరిగింది. కానీ, ఆ తర్వాత మరికొన్ని టైటిళ్లు కూడా తెరపైకి వచ్చాయి. వీటిలో 'అంబాసీడర్' లేదా 'రాయల్' అనే పేర్లలో ఒకటి దాదాపుగా ఖాయం అని అన్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ - మారుతి చిత్రానికి 'వింటేజ్ కింగ్' (Vintage King) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. ఇప్పటికే ఈ పేరును చిత్ర నిర్మాతలు ఫిలిం చాంబర్‌లో సైతం రిజిస్టర్ చేయించారని తెలిసింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని టాక్.

Vintage King Title Fix for Prabhas and Maruthi Movie

ఇదిలా ఉండగా.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - మారుతి కలయికలో రాబోతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, ఇందులో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X