Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్‌సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వైరల్ అవుతున్న RRR పోస్టర్... భారత సినీ రంగం గర్వించే రోజు అంటూ!
బాహుబలి సినిమాతో వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ అయ్యారు ఎస్ఎస్ రాజమౌళి. ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు జక్కన్న. అప్పటికే బడా డైరెక్టర్ గా పేరొందిన రాజమౌళి బాహుబలి తర్వాత అన్నివర్గాల ప్రేక్షకులకు క్రేజ్రీ డైరెక్టర్ గా మారిపోయాడు. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో తదుపరి ప్రాజెక్ట్ రూపొందించే పనిలో పడ్డారు జక్కన్న. ఆ బిగ్గెస్ట్ ప్రాజెక్టు పేరే RRR. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సరిగ్గా ఇదే రోజు (జులై 30) న ఈ సినిమా విడుదల కానుంది.
Indian Cinema is Going to be Very Proud #RRR #AlluriSitaRamaRaju - #RamCharan #KomaramBheem - @tarak9999 #1YeartoGoForRRR 🔥 🌊@ssrajamouli @RRRMovie @DOPSenthilKumar @DVVMovies @upasanakonidela pic.twitter.com/OUDTDHM6c8
— RamCharan™ (@RamCharanOnline) July 30, 2019
ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ తెగ హల్చల్ చేస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరి ఫైరింగ్ లుక్స్‌తో ఆకట్టుకునే పోస్టర్ డిజైన్ చేసిన ఫ్యాన్స్.. వచ్చే సంవత్సరం ఇదే రోజున అంటే 2020 జూలై 30న భారత సినీ రంగం గర్వించదగిన రోజు అవుతుందని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నందమూరి, మెగా అభిమానులు ఈ పోస్టర్ చూసి మురిసిపోతూ లైకులు, షేర్స్ చేసుకుంటున్నారు.
RRR అనే వర్కింట్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎన్టీఆర్ హీరోయిన్ విషయంలో మరో క్లారిటీ రాలేదు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ పోషిస్తున్నారు. భారీ అంచనాల నడుమ వచ్చే ఏడాది జులై 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.