పవన్, బండ్ల గణేష్ ప్రాజెక్ట్.. ఆ ఇద్దరి దర్శకుల్లో ఎవరో ఒకరు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నాను అని ఎట్టకేలకు నిర్మాత బండ్ల గణేష్ స్పెషల్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా పవన్ తో సినిమా చేయాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సీనియర్ నటుడు ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ అయితే అందుకున్నాడు గాని ఎలాంటి దర్శకుడిని లైన్ లో పెడతాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.

టెంపర్ సినిమా తరువాత గణేష్ మళ్ళీ సినిమా చేయలేదు. ఆ మధ్య రాజకీయాలు అంటూ కాస్త హడావుడి చేసి మళ్ళీ తన రెగ్యులర్ బిజినెస్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా పవన్ కళ్యాణ్ తో సినిమా ఎనౌన్స్ చేసి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. అయితే వీరి సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకుడిగా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. అలాగే మరో డైరెక్టర్ కిషోర్ కుమార్ పార్ధసాని కూడా రేసులో ఉన్నట్లు టాక్.

Viral rumours on Bandla ganesh pawan kalyan movie director

ఇక పూరి జగన్నాథ్ తో బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత మరో సినిమా కూడా చేయాలని అనుకున్నాడు. కానీ పవన్ పాలిటిక్స్ లో బిజీ కావడం వల్ల ఆ కాంబో సెట్టవ్వలేదు. ఇక ఇన్నాళ్లకు బండ్ల గణేష్ మళ్ళీ సెట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాలను డైరెక్ట్ చేసిన కిషోర్ కూడా అందుబాటులో ఉన్నాడు. మరి ఫైనల్ గా ఎవరు ఫిక్స్ అవుతారో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X