Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
వైరల్.. ఓ ఐటెం బ్యూటీ నోరు జారితే.. వీడియో వస్తుంటే ఆ కిక్కే వేరయ్యో
ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో వస్తున్న చిన్న సినిమాలే పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. దాని ఫలితం సదరు సినిమా దర్శకుడు, హీరో, హీరోయిన్‌లకు అవకాశాలు వెల్లువగా వచ్చేయడం. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100, గీత గోవిందం లాంటి సినిమాలు ఇదే కేటగిరి లోకి వస్తాయి. ఇక ఆ సినిమాల్లో నటించిన హీరో హీరోయిన్లు ఇప్పుడే రేంజ్ లో ఉన్నారో మీకే తెలుసు.
ఇటీవలే వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా విషయానికే వస్తే.. ఈ సినిమా తెచ్చిపెట్టిన విజయం హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కెరీర్ ని అమాంతం మలుపు తిప్పేసింది. వరుస ఆఫర్స్‌తో బిజీగా ఉన్నారు ఈ ఇద్దరు. ఈ నేపథ్యంలోనే ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ తన రెండో సినిమాగా విలక్షణ కథాంశం 'హిప్పీ; ఎంచుకున్నారు. ఈ చిత్రంలో కార్తికేయ ఇంతవరకు ఏ హీరో చేయని డిఫెరెంట్ రోల్‌లో నటిస్తున్నారట. ఫస్ట్‌లుక్ మొదలుకొని హిప్పీకి సంబందించిన అన్ని అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ చేశాయి.

కాగా తాజాగా చిత్రంలోని 'వైరల్ వైరల్ వైరల్' అనే వీడియో సాంగ్ రిలీజ్ చేసి చిత్రానికి మరింత హైప్ తీసుకొచ్చింది చిత్రయూనిట్. రఘు దీక్షిత్, విష్ణుప్రియ రవి, క్రిస్టోఫర్ స్టాన్లీ ఆలపించిన ఈ పాటలో యూత్‌కి కావాల్సిన అన్ని అంశాలు రంగరించడం విశేషం. ఓ క్లబ్‌లో కార్తికేయ చిందులేస్తూ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు పాటలో ఆకట్టుకుంటున్నాయి. వైరల్ ఓ ఐటెం బ్యూటీ నోరు జారితే.. వీడియో వస్తుంటే ఆ కిక్కే వేరయ్యో అని లేటెస్ట్ పదజాలంతో ఈ పాట ప్రస్తుతం నెట్టింట నిజంగానే వైరల్‌గా మారింది.
టీఎన్ కృష్ణ దర్శకత్వంలో హిప్పీ చిత్రం రూపొందుతోంది. వీ క్రియేషన్స్ బ్యానర్‌పై కళైపులి ఎస్ థాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కార్తికేయ హీరోగా నటిస్తుండగా.. దిగంగనా సూర్యవంశి, జజ్బా సింగ్ ఆయన సరసన ఆడిపాడుతున్నారు. జేడీ చక్రవర్తి, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జూన్ 7 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.