అనుష్క శెట్టిపై కింగ్ కోహ్లీ ముద్దుల వర్షం.. ట్రెండింగ్‌లో విరాట్ విజయం!
భారతీయ క్రికెట్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే ఇండియన్ క్రికెట లీగ్ (IPL 2026) టోర్ని గ్రాండ్‌గా ముగిసింది. అందరూ ఊహించినట్టుగానే ఎలాంటి ఛాలెంజ్ లేకుండా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండోసారి కప్‌ను సొంతం చేసుకొన్నది. డాషింగ్ ఓపెనర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రతాపం ముందు గుజరాత్ టైటాన్స్ జట్టు బౌలర్లు వెలవెలపోయారు. గుజరాత్ విజయానికి కింగ్ కోహ్లీ అడ్డుగా నిలిచాడు. దాంతో ఇంకా రెండు ఓవర్లు ఉండగానే విజయలక్ష్యాన్ని ఆర్సీబీ చేరుకొన్నది. అయితే ఐపీఎల్ ఆరంభం నుంచి తనకు అండగా ఉంటున్న భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో విరాట్ కోహ్లీ కెమిస్ట్రీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నది. ఈ సెలబ్రిటీ జంట ట్రెండింగ్‌లోకి రావడానికి కారణం ఏమిటనే వివరాల్లోకి వెళితే..
ఐపీఎల్ 2026 టోర్నిలో భాగంగా ఆహ్మాదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8వ వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ 50 పరుగులు మినహా, ఎవరూ భారీ స్కోర్ చేయలేకపోయారు. దాంతో 156 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు జట్టు ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓ దశలో టపటపా వికెట్లు పడినా కోహ్లీ పెట్టని కోటల గుజరాత్ బౌలర్లకు ఎదురుగా నిలిచారు. ఓ వైపు బెంగళూరు ఆటగాళ్లు అవుట్ అవుతున్నా.. కోహ్లీ ఛేజింగ్ చేస్తూ 75 పరుగులు సాధించి జట్టుకు విజయాన్ని అందించారు.

అయితే స్టేడియంలో తన సన్నిహితులతో ఆటను వీక్షించిన భార్య అనుష్క శర్మ అనుక్షణం విరాట్ ఆటను ఆస్వాదించింది. కోహ్లీ భారీ షాట్స్ కొట్టినప్పడల్లా ఎంకరేజ్ చేస్తూ చప్పట్లతో సందడి చేసింది. గ్యాలరీలో అనుష్క హావభావాలు, స్నేహితులతో కలిసి మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తున్న సందర్బాలను కెమెరాలు బంధించాయి. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఇక బెంగళూరు జట్టను విజయ తీరాలకు చేర్చిన తర్వాత విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు. మైదానం నుంచే భార్యకు సైగలు చేస్తూ ముద్దుల వర్షం కురిపించాడు. గెలుపు సాధించిన ఆవేశాన్ని, ఆనందాన్ని ఆమెతో మానసికంగా పంచుకొన్నారు. ఇక మ్యాచ్ ముగిసిన వెంటనే గ్రౌండ్ లోకి వచ్చిన అనుష్కను గాఢంగా కౌగిలించుకొన్నాడు. ఆ తర్వాత టీమ్ సభ్యులకు, కామెంటేటర్లకు పరిచయం చేసి వారితో సంభాషిస్తూ కనిపించాడు. ఇక కప్ అందుకొన్న తర్వాత సాంప్రదాయ డప్పుల మోతకు అనుగుణంగా కోహ్లీ డ్యాన్స్ కూడా చేశాడు.

జీటీతో మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్‌లో అనుష్క, కోహ్లీ మధ్య సన్నిహితంగా షేర్ చేసుకొన్న మూమెంట్స్ అందర్నీ ఆకట్టుకొన్నాయి. అనుష్క చేతిలో ఉన్న కవర్‌ను చూపించమని అడిగితే.. చిలిపిగా ఆమె అందుకు నిరాకరించారు. కవర్‌లో ఏముందో చూపించమని కింగ్ కోహ్లీ వెంటపడ్డాడు. కానీ అనుష్క మాత్రం ఆ కవర్‌ను అతడి చేతికి చిక్కకుండా చేసింది. ప్రస్తుతం ఇద్దరు సెలబ్రిటీలకు సంబంధించిన చాలా సన్నివేశాలు ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.
This Couple Moment Will Go Down in HISTORY. 🔥
— Manoz Kumar (@ManozTalks) June 1, 2026
"Tears Filled the Eyes of #ViratKohli after lifting the #IPL Trophy for the Consecutive 2nd Time . #AnushkaSharma was seen lovingly wiping away his Joy of Tears . #IPL2026 . @imVkohli . @AnushkaSharma pic.twitter.com/PQrxP5iYFA


Click it and Unblock the Notifications

