పుష్ప రాజ్ లుక్కుతో విరాట్ కోహ్లీ.. కామెడీగా నవ్వేసిన అల్లు అర్జున్.. ఫొటోస్ వైరల్!
టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటైన పుష్ప కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమాపై రోజురోజుకు అంచనాల డోస్ గట్టిగానే పెరుగుతున్నాయి. ఇక ఇటీవల వచ్చిన ఫస్ట్ టీజర్ తోనే అల్లు అర్జున్ మరోసారి తన పవర్ ను బయటపెట్టాడు. అయితే పుష్ప కేవలం తెలుగులోనే కాకుండా నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారుతోంది. ఇటీవల ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ప్రమోషన్ లో భాగంగా స్టార్ క్రికెట్ ఛానెల్ విరాట్ కోహ్లీని పుష్ప రాజ్ స్టైల్ లో ప్రజెంట్ చేసింది.

ఏకంగా పాన్ ఇండియా ప్రాజెక్టుతో
ఆర్య సినిమాతో లవ్లీ బాక్సాఫీస్ హిట్ అందుకున్న సుకుమార్ బన్నీ కాంబో ఆ తరువాత ఆర్య 2తో డిజాస్టర్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో మూడవసారి అంతకుమించి అనేలా ఉండాలని ఏకంగా పాన్ ఇండియా ప్రాజెక్టుతో సిద్ధమవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్త్తోంది.

ఐపీఎల్ లో పుష్ప రాజ్
ఇక పుష్ప టీజర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో ఈ సినిమా టీజర్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ సినిమా కోసం అమితంగా ఎదురుచూస్తున్నట్లు కామెంట్స్ చూస్తేనే అర్ధమవుతోంది. అదే విదంగా ఐపీఎల్ క్రికెట్ హడావుడిలో కూడా అల్లు అర్జున్ పుష్ప రాజ్ లుక్కు వైరల్ గా మారింది.

పుష్ప రాజ్ లుక్కులో విరాట్
ఇటీవల ఐపీఎల్ మొదటి మ్యాచ్ ముంబై , ఆర్సీబీ మధ్యలో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ లో ఆల్ రౌండర్ ప్రదర్శనతో విరాట్ కోహ్లీ టీమ్ గెలిచింది. ఇక విరాట్ ఫొటోను పుష్ప రాజ్ లుక్కులోకి మార్చేసి తగ్గేదే లే.. అంటూ స్టార్ క్రికెట్ ఛానెల్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

అల్లు అర్జున్ రియాక్షన్
ఇక విరాట్ కోహ్లీ లుక్కుపై అల్లు అర్జున్ కూడా రియాక్ట్ అయ్యాడు. స్మైల్ ఎమోజీ అదిరింది అనేలా సిగ్నల్స్ ఇచ్చాడు. దీంతో నార్త్ ఆడియేన్స్ ను సినిమా మరింత ఎట్రాక్ట్ చేసింది. చూస్తుంటే బన్నీ మొదటి పాన్ ఇండియా బాక్సాఫీస్ హిట్టు సాలీడ్ గా ఉంటుందని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మరి సినిమా అభిమానుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











