twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విరాటపర్వం టీజర్ రివ్యూ: దొంగ లంజాకొడుకా అంటూ.. అణిచివేతపై సాయిపల్లవి ధిక్కార సైరన్

    |

    టాలీవుడ్‌లో రోజు రోజుకు అంచనాల పెంచుతున్న చిత్రం విరాటపర్వం. నీది నాది ఒకే కథ తర్వాత రానా దగ్గబాటి, సాయి పల్లవి కాంబినేషన్‌లో దర్శకుడు వేణు ఊడుగుల రూపొందించిన చిత్రం అందరిలోను ఆసక్తిని పెంచుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్, ఫస్ట్ లుక్ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు పెంచగా.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజైన టీజర్ మరింత హైప్‌ను పెంచింది. తాజాగా రిలీజైన టీజర్‌లోని భావోద్వేగమైన అంశాలు ఎలా కట్టిపడేస్తున్నాదంటే..

    భావోద్వేగమైన కవిత్వంతో రానా

    భావోద్వేగమైన కవిత్వంతో రానా

    విరాటపర్వం టీజర్‌ ఆరంభంలో రానా దగ్గుబాటితో చెప్పించిన భావోద్వేగమైన కవిత్వం సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకొనేలా ఉంది. ఆధిపత్య జాడలను చెరిపేయగలిగినాళ్లు.. తారతమ్మ గోడలను పెకలించ గలిగిననాళ్లు.. దున్నోటోడి వెన్ను విరిచి భూస్వాములు ధనికులైరి అంటూ చెప్పిన డైలాగ్ కథలోని ఇంటెన్సిటిని తెలియజెప్పింది.

    కృష్ణుడి కోసం మీరాబాయి మాదిరిగా

    కృష్ణుడి కోసం మీరాబాయి మాదిరిగా

    ఇక సాయిపల్లవి క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ చెప్పించిన సీన్ మరింత ఆకట్టుకొన్నది. ప్రియమైన అరణ్య. నీకు నేను అభిమాని అయిపోయాను. మీ కవిత్వం చదువుతుంటే నాలో ఏదో తెలియని భావోద్వేగం కలుగుతున్నది. మీరాబాయి కృష్ణుడి కోసం కన్నవాళ్లను, కట్టుకొన్న వాళ్లను ఎలా వదిలిపోయిందో అలా. నేను నీ కోసం వస్తున్నా అంటూ చెప్పించిన డైలాగ్స్ దర్శకుడు వేణు ఊడుగుల కథా పరిణతికి అద్దం పట్టింది.

    ఎరుపు రంగు సీతాకోక చిలుకలా

    ఎరుపు రంగు పులుముకొన్న సీతాకోక చిలుకలా.. నీ కోసం ఇప్పటికిప్పుడే చచ్చిపోయిన పర్వాలేదనిపిస్తున్నది. ప్రేమకు ఇంత శక్తి ఉందా అంటూ సాయి పల్లవి క్యారెక్టర్‌ను తీర్చి దిద్దిన విధానం సినిమాపై సగటు ప్రేక్షకుడికి రెట్టింపు ఆసక్తిని కలిగించేలా కనిపించింది.

    అణిచివేత ధోరణిపై ధిక్కార ధోరణితో

    అణిచివేత ధోరణిపై ధిక్కార ధోరణితో

    ఇక సాయుధ పోరాటంతో నక్సలైట్లు, అణిచివేత ధోరణితో ఉన్న పోలీసు బలగాల మధ్య పోరాటం ఆవేశాన్ని రగిలించేలా ఉంది. అలాగే మహిళలపై రక్షణ దళాల అరాచకాలు శాంపిల్‌గా సాయిపల్లవిపై చిత్రీకరించిన సీన్ ఆలోచింపజేసేలా ఉంది.

    Recommended Video

    Happy Birthday Sai Pallavi : Sai Pallavi Film Career Interesting Facts
    అణచివేత ధోరణిపై ధిక్కార సైరన్

    అణచివేత ధోరణిపై ధిక్కార సైరన్

    అణచివేత ధోరణి కొనసాగితే కలిగే ఆవేశం ద్వారా దొంగ లజ్జాకొడుకా అంటూ సాయిపల్లవితో చెప్పించిన చివరి టీజర్ డైలాగ్ సినిమా లెవెల్ ఏంటో చెప్పింది. టీజర్‌తో దర్శకుడు వేణు ఊడుగుల మరోసారి సంచలన విజయాన్ని దక్కించుకోవడానికి సిద్దమయ్యారనేది స్పష్టమైంది.

    English summary
    Director Venu Vudugula's latest movie is Virata Parvam. Rana Daggubati, Sai Pallavi are in the lead roles.This teaser was released by Mega star Chiranjeevi. In this occassion, Telugu filmibeat brings review on the movie teaser.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X