‘విరాట పర్వం’ విడుదలపై లేటెస్ట్ అప్‌డేట్: అన్నింటి కంటే ముందు ఇదే రాబోతుందట

చాలా కాలంగా హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా. ఈ నేపథ్యంలో అతడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్నాడు. కానీ, ఒక్కటంటే ఒక్క సక్సెస్‌ను కూడా అందుకోలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు ప్యూర్ లవ్ స్టోరీతో 'విరాట పర్వం' అనే సినిమాను చేస్తున్నాడు. వేణు ఉడుగుల రూపొందిస్తోన్న ఈ సినిమా 90వ దశకం నాటి సున్నితమైన ప్రేమకథతో తెరకెక్కింది. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉన్నా, కరోనా వల్ల ఆగిపోయింది. ఈ నేపథ్యంలో దీని గురించి ఓ న్యూస్ లీకైంది.

'విరాట పర్వం' సినిమా ఓటీటీలో విడుదల కాబోతుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ స్పందిస్తూ.. ఆ వార్తలను కొట్టేసింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను లాక్‌డౌన్ ముగిసి.. థియేటర్లకు పర్మీషన్ వచ్చిన వెంటనే విడుదల చేస్తారట. అంటే.. దాదాపుగా జూలైలో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను అతి త్వరలోనే వెల్లడించబోతున్నారని తెలుస్తోంది. ఇదే జరిగితే లాక్‌డౌన్ తర్వాత తొలి సినిమా అయ్యే అవకాశం ఉంది.

Virata Parvam Unit Planned to Release in July

సున్నితమైన ప్రేమకథకు నక్సలైట్ ఉద్యమంతో ముడి పెడుతూ ఈ సినిమాను రూపొందించాడు వేణు ఉడుగుల. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్‌లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నాడు. రానా.. రవన్నగా నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X