పవన్ కళ్యాణ్ డైలాగ్ తో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్.. అదే స్టైల్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగు జనాలు ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల నుంచి రాజకీయాలకు వెళ్ళినా కూడా ఆయన స్థాయి హోదా ఏమాత్రం తగ్గలేదు. సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చినా కూడా బాక్సాఫీసు వద్ద మార్కెట్ కూడా అస్సలు తగ్గలేదు. ఇక పవన్ కళ్యాణ్ కు పక్క రాష్ట్రాల్లో కూడా అభిమానులు చాలామంది ఉన్నారని అందరికి తెలిసిన విషయమే.

ఇక నేషనల్ వైడ్ గా ఉండే ఎంతోమంది సెలబ్రెటీలు కూడా పవర్ స్టార్ క్రేజ్ ను చూసి ఫ్యాన్స్ అయిపోయిన సందర్బాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక రీసెంట్ గా ప్రపంచం మెచ్చిన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా అభిమానుల తరహాలోనే పవర్ స్టార్ డైలాగ్ ను చెప్పాడు. ప్రస్తుతం అభిమానులు ఆ డైలాగ్ ను సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

గబ్బర్ సింగ్ డైలాగ్స్..

గబ్బర్ సింగ్ డైలాగ్స్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక డైలాగ్ రెగ్యులర్ గా జనాల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఇక మాస్ దర్శకులు పవర్ స్టార్ కోసం ప్రత్యేకంగా రాసే డైలాగ్స్ కూడా నిత్యం ఏదో ఒక రకంగా వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమాలోని డైలాగ్స్ సెలబ్రెటీలు కూడా చాలా రకాలుగా వాడుతుంటారు. టెలివిజన్ రంగంలో కూడా ఎక్కువగానే వినిపిస్తూ ఉంటుంది.

వీరేంద్ర సెహ్వాగ్ కూడా

వీరేంద్ర సెహ్వాగ్ కూడా

ఇక చాలా రోజుల అనంతరం ఒక స్టార్ క్రికెటర్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ ను చెప్పిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒకప్పుడు గ్రౌండ్ లో ఎలా చెలరేగిపోయేవాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు మాత్రం తనదైన శైలిలో సోషల్ మీడియాలో డైలాగ్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ఎలాంటి సమస్యలపై అయినా సరే ఓపెన్ గా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

పవన్ ను ఇమిటేట్ చేస్తూ

ఇక మొదటిసారి వీరేంద్ర సెహ్వాగ్ గబ్బర్ సింగ్ సినిమాలోని ఆల్ టైమ్ బెస్ట్ డైలాగ్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. నాక్కొంచెం తిక్కుంది. కానీ దానికో లెక్కుంది.. అనే డైలాగ్ ను పవన్ కళ్యాణ్ మ్యానరిజంతో చెప్పడం విశేషం. పవన్ ఎలాగైతే మెడపై చేయి పెట్టుకుంటాడో అలాగే వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇమిటేట్ చేశారు. ఒక అభిమాని సలహాతోనే వీరేంద్ర సెహ్వాగ్ ఈ డైలాగ్ చేసినట్లుగా తెలుస్తోంది.

Recommended Video

Bheemla Nayak పాటతో కిన్నెర మొగిలయ్య స్టార్ స్టేటస్.. ఏంటీ కాంట్రవర్సీ || Filmibeat Telugu
సెహ్వాగ్ మాత్రం కాస్త భిన్నంగా

సెహ్వాగ్ మాత్రం కాస్త భిన్నంగా

ఇక ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 50వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ రోజు ఎంతోమంది సెలబ్రెటీలు పవన్ కళ్యాణ్ కు వారి స్టైల్ లో విషెస్ అంధించారు. కొందరు డ్యాన్స్ తో మరికొందరు డైలాగ్స్ తో పవర్ స్టార్ సెలబ్రేషన్స్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ మరికొంత భిన్నంగా గబ్బర్ సింగ్ డైలాగ్ తో పవర్ స్టార్ అభిమానులను ఆకట్టుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ నుంచి నెక్స్ట్ భీమ్లా నాయక్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X