థియేటర్‌లో ప్రేక్షకులపై డబ్బుల వర్షం.. 11 ఐఫోన్లు బహుమతులు .. వర్జిన్ బాయ్స్ క్రేజీగా రిటర్న్ గిఫ్టులు
దేశవ్యాప్తంగా సినిమా పరిశ్రమ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఓటీటీలు, పైరసీ ప్రభావంతో ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించడం అత్యంత కష్టమైన పనిగా మారింది. ఇలాంటి సమయంలో నిర్మాతలు, దర్శకులు, సినిమా యూనిట్స్ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రేక్షకుడిని ఆకట్టుకొనే విధంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ సినిమాపై ఆసక్తి పెంచి.. అలాగే థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడిని తృప్తి పరిచే విధంగా రిటర్న్ గిఫ్టు ఇవ్వాలని నిర్మాత భావించారు. ఆ నిర్మాత ప్రకటించిన రిటర్న్ గిప్టుల వివరాల్లోకి వెళితే..
కొత్త సినిమాల రిలీజ్ సమయంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనే విషయం ఇండస్ట్రీలో అందర్నీ ఆందోళనకు గురి చేస్తున్నది. అయితే చిన్న సినిమా గానీ, పెద్ద సినిమా గానీ కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అయితే తాజాగా కంటెంట్‌తోపాటు యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన వర్జిన్ బాయ్స్ సినిమా యూనిట్ కొత్త రకమైన ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే వర్జిన్ బాయ్ నిర్వహించిన ప్రెస్ మీట్స్ గానీ, మీడియా ఇంటర్వ్వూలు గానీ ట్రెండింగ్‌గా నిలిచాయి. ఈ సినిమాలోని కంటెంట్ ఎలివేట్ అవ్వుతూ ప్రమోషన్స్ ఆడియన్స్ రీచ్ అయ్యేలా చేశాయి. ఇక ఈ సినిమాలో టికెట్ కొట్టు.. ఐ ఫోన్ పట్టు అనే స్కీమ్‌ను ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ప్రకటించారు. అలాగే థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులపై డబ్బుల వర్షం కురిపించే స్కీమ్‌ను పెట్టామని ప్రకటించారు. ఈ రెండు స్కీమ్‌లు కూడా అందరిలో ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేశాయి.
అయితే థియేటర్‌లో కూర్చొన్న ప్రేక్షకులను రాండమ్‌గా సెలెక్ట్ చేసి వారిపై మనీ రెయిన్ (డబ్బు వర్షం) కురిపిస్తాం. కానీ ఇతర ప్రేక్షకులకు, థియేటర్‌లో ఎలాంటి తొక్కిసలాటకు గురికాకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాం. ఈ విషయంలో ఎలాంటి భయం లేదని చిత్ర యూనిట్ వెల్లడించారు. ఇక టికెట్ కొట్టు.. ఐఫోన్ పట్టు విషయానికి వస్తే.. సినిమా చూసిన ప్రేక్షకులు తమ టికెట్ ముక్కను చిత్ర యూనిట్‌కు వాట్సప్‌లో పంపిస్తే.. వారు లక్కీ డీప్ ద్వారా 11 మందిని ఎంపిక చేసి ఐఫోన్ అందించే ఏర్పాటు చేస్తామని నిర్మాత రాజా దారపునేని తెలిపారు.
రాజ్ గురు బ్యానర్‌పై రాజా దారపునేని నిర్మాతగా యువ దర్శకుడు దయానంద్ గడ్డం రచనా దర్శకత్వంలో జులై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించనున్నారు. స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. బబ్లు, కౌశల్ మంద, ఆర్జె సూర్య, సుజిత్ కుమార్, కేదార్ శంకర్, ఆర్జె శరన్, శీతల్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఈరోజు మీడియా సమక్షంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో అంగరంగ వైభవంగా వర్జిన్ బాయ్స్ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది.


Click it and Unblock the Notifications











