Virgin Story టీనేజ్‌కు కిక్కిస్తున్న డిఫరెంట్ లవ్‌స్టోరి.. నిర్మాత లగడపాటి శ్రీధర్ సంతోషం

పర్‌ఫెక్ట్ కంటెంట్‌తో వస్తే టాలీవుడ్‌లో యూత్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలకు భారీగా ఆదరణ ఉంటుందని వర్జిన్ స్టోరి చిత్రం నిరూపించింది. నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన వర్జిన్ స్టోరి చిత్రం ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెన్సిబుల్ రొమాన్స్‌తో అశ్లీల సన్నివేశాలు లేకుండా మలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించిన చిత్రం యూత్‌ను విశేషంగా ఆకర్షిస్తున్నది. సౌమిక పాండియన్ నాయికగా నటించగా.. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించారు. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్మాణ సంస్థ కార్యాలయంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా

Virgin Story gets overwhelming response all over the world: Lagadapati Sridhar

నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ..."వర్జిన్ స్టోరి" చిత్రంతో ఒక కొత్త ప్రయత్నం చేశామని అభినందిస్తున్నారు. రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి. అవకాశం ఉన్నా ఎక్కడా అసభ్యత చూపించలేదని ప్రశంసిస్తున్నారు. యూఎస్ నుంచి మిత్రులు కాల్ చేసి సినిమాపై మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. టీనేజ్‌లో ఉన్న వాళ్లకు మా సినిమా కంటెంట్ బాగా అర్థమవుతుంది. సినిమాకు విజయాన్ని అందించి మమ్మల్ని మా టీమ్ ను ప్రోత్సహించిన అందరికీ కృతజ్ఞతలు అని అన్నారు.

దర్శకుడు ప్రదీప్ బి అట్లూరి మాట్లాడుతూ... క్లీన్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ చేశాం. యూత్ నుంచి రెస్పాన్స్ బాగుంది. కామెడీలో చాలా రకాలు ఉంటాయి. మేము విభిన్నంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇద్దామని ప్రయత్నించాం. మంచి రివ్యూస్ వచ్చాయి. ఆడియెన్స్ నుంచి ఇంకా మంచి స్పందన ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అని అన్నారు.

నాయిక సౌమిక పాండియన్ మాట్లాడుతూ... నేను పియూ అనే పాత్రకు న్యాయం చేస్తానని నమ్మిన దర్శకుడు ప్రదీప్‌కి థాంక్స్. థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు నా క్యారెక్టర్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయపడ్డాను. కానీ కొన్ని సీన్స్ పూర్తయ్యాక నేను బాగానే నటించానని నమ్మకం కలిగింది. కొత్త ప్రయత్నం చేసిన మా చిత్రాన్ని ఆదరించండి అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X